/rtv/media/media_files/2025/10/15/isreal-hamas-2025-10-15-12-47-05.jpg)
Isreal-Hamas
ఇటీవల ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత హమాస్‌లో మారణహోమం మొదలైంది. గాజా వీధుల్లో ఎనిమిది మందిని దారుణంగా హత్య చేశారు. వారి కళ్లకు గంతలు కట్టి, వారికి కొడుతూ చివరకు కాల్చి చంపని వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో మళ్లీ గాజాలో హింస చెలరేగింది. అయితే గాజా వీధుల్లో మోకాళ్ల మీద దుండగులను ఉంచి దారుణంగా ఎందుకు చంపారనే సందేహం అందరిలో మొదలైంది. అయితే వీరు హమాస్‌కు కాకుండా ఇజ్రాయెల్‌కు సపోర్ట్‌గా ఉన్నారని అందుకే నడిరోడ్డు మీద ఇలా హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఈ వీడియోలో ఎనిమిది మంది కనిపించినా దాదాపు 52 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. అయితే చనిపోయిన వారు ఇజ్రాయెల్‌కు చెందిన వారేనా? హమాస్‌కు కాకుండా ఇజ్రాయెల్‌కు సాయం చేస్తున్నారని చంపారా? అసలు చంపడానికి గల కారణాలు ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Pakisthan Vs Afghanistan: 15 నిమిషాల్లోనే తోక ముడిచిన పాక్.. సైనికులు పరుగో పరుగు-VIDEO VIRAL
In the past 48 hours, Hamas has executed nearly 50 Palestinians in Gaza.
— Eyal Yakoby (@EYakoby) October 14, 2025
Mehdi Hasan? Not a word.
Ana Kasparian? Not a word.
Cenk Uygur? Not a word.
The media? Not a word.
The UN? Not a word.
తమ ముఠాలను పెంచుకోవాలని..
హత్యకు గురైన ఎనిమిది మంది వ్యక్తులు ఇజ్రాయెల్‌కు చెందినవారు కాదు. వీరంతా గాజాలో నివసించే పాలస్తీనియన్ పౌరులు. వీరిని హత్య చేసింది కూడా పాలస్తీనాకే చెందిన హమాస్ సాయుధ బలగాలు. అయితే హమాస్ ఈ ఎనిమిది మంది పాలస్తీనియన్లను చంపడానికి ప్రధాన కారణం.. ఇజ్రాయెల్‌కు సహకరించడమే. అయితే వీరు ఇజ్రాయెల్ సైన్యానికి గూఢచార సమాచారాన్ని అందించారని, హమాస్ స్థావరాలు లేదా నాయకుల గురించి కీలక వివరాలు ఇచ్చారని హమాస్ ఆరోపించింది. వీరిలో కొంతమంది యుద్ధ సమయంలో హమాస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన స్థానిక సాయుధ ముఠాలు అని తెలుస్తోంది. యుద్ధం వల్ల అస్తవ్యస్తంగా మారిన గాజాలో హమాస్ అధికారం కోల్పోతున్న సమయంలో ఈ ముఠాలు తమ శక్తిని పెంచుకోవాలని చూశాయి.
పూర్తి అధికారాన్ని స్థాపించడానికి..
వీరు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్నారని హమాస్ భావించింది. అయితే శాంతి ఒప్పందం కుదిరి, ఇజ్రాయెల్ దళాలు కొంతవరకు వెనక్కి తగ్గిన వెంటనే గాజాలో హమాస్ తన పూర్తి అధికారాన్ని తిరిగి స్థాపించుకోవడానికి ప్రయత్నించింది. యుద్ధం కారణంగా గాజాలో చట్టం, భద్రత వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీంతో దోపిడీలు, నేరాలు పెరిగాయి. హమాస్ పాలన ఇంకా బలంగా ఉందనే సందేశాన్ని ప్రజలకు పంపడానికి, భద్రతను తిరిగి నెలకొల్పడానికి ఈ చర్యలు తీసుకుంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, గాజాలో అంతర్గత రక్తపాతం అయితే మొదలైంది. అలాగే ఇజ్రాయెల్ బందీల శవాలను ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఈ కారణాల వల్లనే నడి రోడ్డుపై ఎనిమిది మందిని కాల్చి చంపినట్లు సమాచారం. అయితే మున్ముందు మళ్లీ ఎలాంటి హింసాత్మాక ఘటనలు జరుగుతాయని ప్రజలు భయపడుతున్నారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: గాజాలో మళ్లీ చెలరేగిన హింస.. పారుతున్న రక్తం.. 50 మంది హతం?