GAZA: గాజాపై ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు..28 మంది మృతి

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ మళ్ళీ గాజాపై దాడులు చేసింది. ఇందులో దాదాపు 28 మంది చనిపోయారని తెలుస్తోంది. హమాస్ ఉగ్రవాదులు తమ దేశంపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించడంతోనే స్ట్రైక్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ మిలటరీ చెబుతోంది.

New Update
gaza

పాలస్తీనాపై ఇజ్రాయెల్ మరోసారి దాడులకు పాల్పడింది. బుధవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ వైమానిక దళం గాజా స్ట్రిప్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 28 మంది చనిపోయారని ప్రాణాలు కోల్పోయారని గాజా డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. గాజాలో 12 మంది, ఖాన్‌ యూనిస్ ప్రాంతంలో 10 మంది మృతి చెందినట్లు హమాస్ చెప్పింది. ఈ దాడులపై ఇజ్రాయెల్ కూడా మాట్లాడింది. హమాస్ ఉగ్రవాదులు తమ దేశంపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించడంతోనే స్ట్రైక్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ మిలటరీ చెబుతోంది. ఇజ్రాయెల్ బాంబు దాడిలో కనీసం 77 మంది పాలస్తీనియన్లు గాయపడ్డారని గాజాలోని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నెలలో అమల్లోకి వచ్చిన అమెరికా మధ్యవర్తిత్వంలోని కాల్పుల విరమణ అతిపెద్ద ఉల్లంఘన ఇదని అంటున్నారు.  ఇజ్రాయెల్... ఖాన్ యూనిస్ సమీపంలోని దక్షిణ గాజాలోని అల్-మవాసి ప్రాంతంతో సహా మూడు నిర్దిష్ట ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందని చెబుతున్నారు. 

ట్రంప్ తీర్మానాన్ని ఆమోదించిన ఐక్యరాజ్య సమితి..

మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా కోసం 20 అంశాల శాంతి ప్రణాళిక రూపొందించారు. తాజాగా అమెరికా రూపొందించిన ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సోమవారం ఆమోదించింది. ఈ ప్రతిపాదనకు అంతర్జాతీయ ఆదేశం లభించింది . ఈ తీర్మానానికి అనుకూలంగా 13 ఓట్లు వచ్చాయి. అయితే రష్యా, చైనాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. దీంతో గాజాలో అంతర్జాతీయ స్థిరీకరణ దళం లేదా ఐఎస్ఎఫ్ ఏర్పాటుకు అధికారం వస్తుంది. దీని గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ..ఐఎస్ఎఫ్ లో చేరడానికి సుముఖత వ్యక్తం చేశాయని తెలిపారు. ఈ దళం గాజాలోకి ప్రవేశించడం, సైనికీకరణను నిరాయుధీకరణ చేయడం, కీలక ప్రాంతాలను భద్రపరచడం, మానవతా సహాయం అందించడంలో మద్దతు ఇవ్వడం వంటి పనులను చేస్తుంది. ఇది ఇజ్రాయెల్, ఈజిప్టుతో తన కార్యకలాపాలను సమన్వయం చేస్తుంది.

Also Read: India-Pak: భారత్ తమతో ఎప్పుడైనా యుద్ధానికి దిగొచ్చు..పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు