US Waring On Hamas: గాజాపై దాడికి హమాస్ ప్లాన్...హెచ్చరించిన అమెరికా

గాజాపై హమాస్ దాడి చేయొచ్చని అమెరికా హెచ్చరించింది. కాల్పుల విరమణను ఉల్లంఘించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం అందిందని చెప్పింది.  పాలస్తీనా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయవచ్చని చెప్పింది.

New Update
gaza (1)

హమాస్ మాట తప్పుతుందని అంటోంది అమెరికా(america). తమకు విశ్వసనీయ వర్గాల సమాచారం ఉందని...గాజాపై హమాస్ దాడి చేస్తుందని హెచ్చరిస్తోంది. పాలస్తీనా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయవచ్చని చెప్పింది. ట్రంప్ రూపొందించిన శాంతి ఒప్పందాన్ని హమాస్ ఉల్లంఘించడానికి ట్రై చేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. దీని కారణంగా అమెరికా చేసిన ప్రయత్నాలన్నీ దెబ్బతింటాయని అంది. శాంతి ఒప్పందానికి ఎవరైతే హమీదారులుగా ఉన్నారో వారందరూ హమాస్ కాల్పుల విరమణ నిబంధనల ప్రకారం తన బాధ్యతలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పింది. ఈ నేపథ్యంలో గాజాలో పౌరులభద్రతను నిర్థారించడం, ప్రశాంతతను, శ్రేయస్సును పెంపొందిచడంపై అమెరికా, ఇతర హామీ దేశాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి.

Also Read :  భారత్-పాక్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో భూకంపం.. స్పాట్ లో ..

అక్కడకు వెళ్ళి మరీ చంపేస్తాం.. 

ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) కూడా స్పందించారు. హమాస్ సృష్టిస్తున్న మారణహోమం మీద వచ్చిన నివేదికలను చూశానని...అంతర్గత రక్తపాతం ఆపకపోతే వారిని చంపడానికి వేరే మార్గం ఉండదని హెచ్చరించారు. మాకు లోపలికి వెళ్ళ హమాస్‌ను చంపడం తప్ప వేరే మార్గం లేదని ట్రంప్ అన్నారు. గాజాలో హమాస్ ఉగ్రవాదులు తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇలా చేయడం చాలా దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్గత హింస గురించి తాము తక్కువ అంచనా వేశామని...ఇప్పుడు వారు మేము అనుకున్న దానికంటే క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ట్రంప్ అన్నారు. ప్రస్తుతం గాజాలో హమాస్ చెడ్డ ముఠాలను మాత్రమే తుడిచిపెట్టిందని తెలుస్తోందని..అంతకు వరకూ తనకు సమస్య లేదని..కానీ దానిని మించి చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పారు. వారు త్వరలోనే నిరాయుధులు అవుతారు. అలా చేయకపోతే మేము వారిని బలవంతంగా నిరాయుధులను చేస్తామని. తర్వాత అది బహిరంగ హింసగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రంప్ అన్నారు.     

Also Read :  విమానం గాల్లో ఉండగా మంటలు.. భయాందోళనలో ప్రయాణికులు..

Advertisment
తాజా కథనాలు