GAZA: గాజాలో భీకర దాడులు..104 మంది మృతి

ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య యుద్ధం మళ్ళీ మొదలైంది. ఇరు వర్గాలు కాల్పుల విరమణకు బ్రేక్ ఇచ్చాయి. తాజాగా ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపించింది. ఇందులో 104 మంది మరణించారు. 

New Update
Strikes

శాంతి ఒప్పందాన్ని బ్రేక్ చేసి ఇజ్రాయెల్ మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది.  గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది.ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలతో మళ్లీ దాడులు ప్రారంభించింది. దక్షిణ గాజాలో తమ బలగాలపై హమాస్ కాల్పులు జరిపినందుకే తాము మళ్ళీ యుద్ధం ప్రారంభించామని నెతన్యాహు తెలిపారు.  

వంద మందికి పైగా..

మంగళవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ వరుసగా దాడులు చేస్తోంది. గాజాపై వరుసపెట్టి బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడుల్లో 104 మంది పాలస్తీనా పౌరులు చనిపోగా మరో 250 మందికి గాయాలయ్యాయి. తమ సైనికుడిని హమాస్ చంపేయడంతో టెర్రర్ గ్రూపులపై దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే హమాస్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. ఐడీఎప్ ఏ కారణం లేకుండానే స్కూళ్ళు, ఇళ్ళపై బాంబులు వేస్తోందని ఆరోపించింది. 

Advertisment
తాజా కథనాలు