Isreal-Gaza: మళ్లీ గాజా-ఇజ్రాయెల్ వార్ స్టార్ట్.. స్పాట్‌లోనే వందలాది పాలస్తీనీయులు?

శాంతి ఒప్పందాన్ని బ్రేక్ చేసి ఇజ్రాయెల్ మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది. మంగళవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ జరిపిన ఈ వైమానిక దాడుల్లో మొత్తం 64 మంది పాలస్తీనియులు మృతి చెందారు. వందలాది ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
Isreal Gaza

Isreal Gaza

ఇటీవల ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఈ శాంతి ఒప్పందాన్ని బ్రేక్ చేసి ఇజ్రాయెల్ మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది. మంగళవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ జరిపిన ఈ వైమానిక దాడుల్లో మొత్తం 64 మంది పాలస్తీనియులు మృతి చెందారు. వీరిలో 24 మంది చిన్న పిల్లుల కూడా ఉన్నారు. అలాగే వందలాది ప్రజలు గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలతో మళ్లీ దాడులు ప్రారంభించింది. దక్షిణ గాజాలో తమ బలగాలపై హమాస్ కాల్పులు జరిపినందుకే ఈ దాడులు జరిపినట్లు నెతన్యాహు తెలిపారు. ఇజ్రాయెల్ తీరును హమాస్ తీవ్రంగా ఖండించింది. మరోసారి గాజాపై భీకర దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మళ్లీ వార్ మొదలైతే ఇక శాంతి ఒప్పందం కుదరడం కష్టమేనని పలువురు భావిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: H-1b Visa: హెచ్ 1బీ వీసా ఫీజు ఎఫెక్ట్..డోర్స్ క్లోజ్ చేసిన టెక్ దిగ్గజాలు

ఇది కూడా చూడండి:Pak-Afghan: యుద్ధం అంచున పాక్, ఆఫ్ఘాన్..విఫలమైన టర్కీ శాంతి చర్చలు

Advertisment
తాజా కథనాలు