Israel : ఇజ్రాయెల్‌లో ఉద్రిక్తత..ఐరాస ప్రధానకార్యాలయం కూల్చివేత

ఇజ్రాయెల్‌లో పాలస్తీనా శరణార్థుల కోసం ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్‌ నేషన్స్‌ రిలీఫ్‌ అండ్‌ వర్క్స్‌ ఏజెన్సీ (UNRWA) ప్రధాన కార్యాలయాన్ని ఇజ్రాయెల్‌ దళాలు కూల్చివేశాయి. తూర్పు జెరూసలెంలో ఉన్న ఈ కార్యాలయాన్ని సాయుధ దళాలు నేలమట్టం చేశాయి.

New Update
FotoJet - 2026-01-21T072355.362

Demolition of UN headquarters

Israel : ఇజ్రాయెల్‌లో పాలస్తీనా శరణార్థుల కోసం ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్‌ నేషన్స్‌ రిలీఫ్‌ అండ్‌ వర్క్స్‌ ఏజెన్సీ (UNRWA) ప్రధాన కార్యాలయాన్ని ఇజ్రాయెల్‌ దళాలు కూల్చివేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. తూర్పు జెరూసలెంలో ఉన్న ఈ కార్యాలయాన్ని సాయుధ దళాలు నేలమట్టం చేశాయి. షేఖ్‌ జర్రాలోని తమ ప్రాంగణం లోకి ఇజ్రాయెల్‌ దళాలు ప్రవేశించి తమ సిబ్బందిని కార్యాలయం నుంచి బలవంతంగా బయటకు తరలించాయని యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించింది. తద్వారా అంతర్జాతీయ చట్టాలను, ఐరాస హక్కులను ఇజ్రాయెల్‌ ఉల్లంఘించిందని తీవ్రంగా మండిపడింది.

1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు తమ నివాసాలను, జీవనోపాధిని కోల్పోయి పాలస్తీనా ప్రజలు దేశం విడిచి వెళ్లారు. వారి సంరక్షణకు ఐక్యరాజ్యసమితి సహాయక సంస్థ 1949లో యునైటెడ్‌ నేషన్స్‌ రిలీఫ్‌ అండ్‌ వర్క్స్‌ ఏజెన్సీ (UNRWA) ను ఏర్పాటు చేసింది. అలాంటి కార్యాలయాన్ని ఇజ్రాయెల్‌ దళాలు మొత్తం కూల్చివేశాయి. అయితే యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏకు హమాస్‌తో సంబంధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ చాలాకాలంగా ఆరోపిస్తోంది. తమ దేశంలో ఆ సంస్థను నిషేధిస్తూ తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారమే కూల్చివేతలు జరిగాయని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. కాగా 1950 నుంచి యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ ఇజ్రాయెల్‌లో పాలస్తీనా శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తూ.. పాఠశాల విద్య, వైద్య సేవలు అందిస్తూ పనిచేస్తోంది.

 తమ దేశంలో బహిష్కరించిన సంస్థపై నూతన చట్టం ప్రకారం ప్రధాన కార్యాలయాన్ని కూల్చివేసి నేలమట్టం చేశామని ఆ దేశ విదేశాంగ మంత్రి వెల్లడించారు. యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ 1950 నుంచి పనిచేస్తోందని తెలిపారు.  ఐక్యరాజ్యసమితి సంస్థ తమ దేశంలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని గతంలో టెల్‌అవీవ్‌ ఆదేశించింది. ఇటీవల ఒక చట్టాన్ని తీసుకొచ్చి సంస్థను పూర్తిగా నిషేధించింది. ఈ క్రమంలోనే కూల్చివేతలు చోటు చేసుకోవడంతో ఇజ్రాయెల్‌ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తుందని ఆరోపణలు వినవస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు