/rtv/media/media_files/2026/01/23/trump-v-hamas-2026-01-23-11-47-35.jpg)
గాజాలో ఇజ్రాయెల్ కు, హమాస్ కు మధ్య యుద్ధం ముగిసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇరు వర్గాలు శాంతికి ఒప్పుకున్నాయి. ఇజ్రాయెల్ దళాలు గాజాను వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. దీని తరువాత నుంచి ట్రంప్ గాజాలో శాంతిని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం గాజా బోర్డ్ ఆఫ్ పీస్ ను కూడా ప్రతిపాదించారు. ఇందులో చాలా దేశాలను ఇన్వాల్వ్ కూడా చేశారు. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ద్వారా గాజా స్ట్రిప్‌లో పునర్నిర్మాణం, కొత్త ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం ప్లాన్ చేస్తున్నారు. అలాగే మరోసారి హమాస్‌ను బెదిరించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన గాజా శాంతి వేదికలో మాట్లాడుతూ, హమాస్ తన ఆయుధాలను అప్పగించకపోతే నాశనం చేయబడుతుందని అన్నారు.
గాజాలో పట్టు పెంచుకుంటున్న హమాస్..
ఇజ్రాయెల్ దళాలు గాజాను ఆక్రమించుకున్నప్పటి నుంచి హమాస్ అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయింది. దాక్కున్న వారిని ఐడీఎఫ్ వెతికి వెతికి మరీ చంపేసింది. అయితే యుద్ధం ముగిశాక ఇజ్రాయెల్ సైన్యం గాజాను ఖాళీ చేసింది. ప్రస్తుతం అక్కడ ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో గాజాలో హమాస్ మళ్ళీ పుంజుకుంటోందని తెలుస్తోంది. గాజాపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ఐడీఎఫ్ ఉపసంహరించుకున్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం ప్రారంభించాయి. ముఖ్యంగా గాజా నగరం, జబాలియా, నుసైరత్, అల్-బురైజ్, బీట్ లాహియా, ఖాన్ యూనిస్‌లోని కొన్ని ప్రాంతాలలో హమాస్ మళ్ళీ పాగా వేస్తోందని సమాచారం.
చురుగ్గా 2 వేల మంది ఉగ్రవాదులు..
మరోవైపు ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందంలో హమాస్ తమ ఆయుధాలను అప్పగించాలని కూడా ఉంది. కానీ హమాస్ ఇప్పటి వరకు ఆ పని చేయలేదు. పైగా మేము పోరాటం ఆపేస్తామని చెప్పాము కానీ ఆయుధాలను అప్పగిస్తామనలేదని అంటోంది. నిజానికి ఇజ్రాయెత్ తో జరిగిన యుద్ధంలో ఆ సంసథ పూర్తిగా నాశనం అవ్వలేదు. గాజాలో ఇప్పటికీ హమాస్ ఒకే సంస్థగా కాకుండా ఒక వ్యవస్థగా పనిచేస్తోంది. దాని యోధులు, కమాండర్లు, నెట్‌వర్క్‌లు పూర్తిగా నిర్మూలించబడలేదు. అవన్నీ పని చేస్తున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం వెళ్ళిపోగానే..అవి వెనక్కు తిరిగి వచ్చాయి. హామస్ లో దాదాపు 2వేల మంది ఉగ్రవాదులు ఇంకా చురుగ్గానే ఉన్నారని న్యూ యార్క్ టైమ్స్ నివేదించింది.
ఆయుధాలను బయటకు తీస్తోంది..
అలాగే హమాస్ కు ఆయుధాలను దాచడంలో విస్తృతమైన అనుభవం ఉంది. ఆయుధాలు ఇప్పటికే సొరంగాలు, భూగర్భ నిల్వ సౌకర్యాలలో ఉన్నాయని తెలుస్తోంది. యుద్ధంలో అనేక రహస్య స్థావరాలు ధ్వంసమైనప్పటికీ.. మొత్తం మౌలిక సదుపాయాలు నాశనం కాలేదు. కాల్పుల విరమణ ప్రకటించిన వెంటనే, హమాస్ తన దళాలను తిరిగి సమీకరించి ఆయుధాలను బయటకు తీసుకువచ్చింది. దాంతో పాటూ దీనికి పోలీసుల లాంటి వ్యవస్థ కూడా ఉందని చెబుతున్నారు. కాల్పుల విరమణ తర్వాత.. అది వెంటనే తన పోలీసులను వీధుల్లోకి మోహరించింది. ప్రజా నియంత్రణ, భయం, శిక్షలను ఉపయోగించి గాజా ప్రజల్లో ఉన్న భిన్నాభిప్రాయాల స్వరాలను అణచివేయడం ప్రారంభించింది. ఈ ఉగ్రవాద సంస్థ ఇప్పటికీ భద్రతా సేవలతో సహా గాజాలో కీలకమైన ప్రభుత్వ నిర్మాణాలను నడుపుతోంది. ఇజ్రాయెల్ దళాలు ఉపసంహరించుకున్న ప్రతిచోటా హమాస్ సాయుధ సిబ్బంది ఇప్పుడు కనిపిస్తున్నారు.
హమాస్ లేకుండా కష్టమే..
హామస్ ఇంత బలంగా ఉన్న చోట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ ప్రతిపాదన పని చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో హమాస్ పాల్గొంటుందా లేదా అనేది తెలియదు. ఒకవేళ ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ను హమాస్ తిరస్కరిస్తే..ఏదైనా సహాయ, పరిపాలనా లేదా నిర్మాణ కార్యకలాపాలను నిర్వహించడం కష్టం అవుతుంది. ట్రంప్ ఈ గాజా బోర్డ్ ఆఫ్ పీస్ లో ఇతర దేశాలనూ ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఒకవేళ హమాస్ కనుక దీనికి వ్యతిరేకంగా మారితే.. ఇప్పుడు కూడుతున్న దేశాన్నీ...అప్పుడు దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అప్పుడు హమాస్ కు ఇంకా బలం పెరిగిపోతుంది. ట్రంప్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.
Follow Us