/rtv/media/media_files/2025/06/24/israel-pm-netanyahu-2025-06-24-14-40-15.jpg)
Israel PM Netanyahu
కాల్పుల విరమణ జరిగి పట్టుమని నెల రోజులు అయినా కాలేదు. బందీల మార్పిడి అయితే జరిగింది. కానీ హమాస్ మాత్రం కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. పదే పదే కాల్పుల విరమణను ఉల్లంఘించింది. ఇప్పుడు ఇదే ఆరోపణలతో ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది. ఈరోజు ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు గాజాపై శక్తివంతమైన, తక్షణ దాడికి ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. దక్షిణ గాజాలో హమాస్ తన దళాలపై కాల్పులు జరిపినట్లు ఇజ్రాయెల్ నివేదించడంతో ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. హమాస్..ఇజ్రాయెల్ బందీల అవశేషాలను తిరిగి ఇవ్వకపోవడం కూడా దీనికి కారణమని అంటున్నారు. ఇది స్పష్టంగా కాల్పుల విరమణను ఉల్లంఘించడమేనని నెతన్యాహు ఆరోపిస్తున్నారు. గాజాలో ఇంకా 13 మంది బందీల మృతదేహాలు ఉన్నాయి. వాటిని ఇప్పటి వరకు హమాస్ అప్పగించలేదు.
వెంటనే దాడులు..
దీంతో భద్రతా సంప్రదింపుల తర్వాత గాజా స్ట్రిప్ లో వెంటనే దాడులను నిర్వహించాలని ప్రధాని నెతన్యాహు సైన్యాన్ని ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రధాని కార్యాలయం ఎక్స్ లో పోస్ట్ చేసింది. గాజా ప్రాంతంలో ఐడిఎఫ్ నియంత్రణలో ఉన్న భూభాగాన్ని విస్తరించాలని ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నిర్ణయించారని హిబ్రూ మీడియా నివేదికలను టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది. అంతకు ముందు హమాస్..రఫాలో ఇజ్రాయెల్ దళాలపై కాల్పులు జరిపింది.
Following security consultations, Prime Minister Netanyahu has directed the military to immediately carry out forceful strikes in the Gaza Strip.
— Prime Minister of Israel (@IsraeliPM) October 28, 2025
 Follow Us
 Follow Us