Delhi Blast Update: హమాస్ తరహా దాడులకు ప్లాన్..ఢిల్లీ బ్లాస్ట్ దర్యాప్తులో సంచలన విషయాలు

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ విషయంలో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. తాజాగా ఉగ్రవాదులు ఢిల్లీ బాంబు పేలుడు కన్నా ముందు 2023లో ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడుల తరహా ఇక్కడ కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది.

New Update
delhi blast update

ఢిల్లీ పేలుడులో మరొక కీలక వ్యక్తిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. ఆత్మాహుతి దాడిలో ఉమర్ నబీతో కలిసి పని చేసిన మరొక ఉగ్రవాది అమీర్ రషీద్ అలీ అలియాస్ పు ఆదివారం ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. దాంతో పాటు నిన్న సోమవారం కారు బాంబు తయారు చేసిన జసీర్బిలాల్ అలియాస్ డానిష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ ప్రకటించింది. అమీర్ రషీద్ అలీ జమ్మూ కాశ్మీర్‌లోని సాంబురా, పాంపోర్‌కు చెందినవాడు. పేలుడుకు ఉపయోగించిన వాహనాన్ని కొని, దానిని IEDగా మార్చడంలో అతను బాంబర్‌తో కలిసి కుట్ర పన్నినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఈ కారు అమీర్ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. చనిపోయిన డ్రైవర్ ఉమర్ ఉన్ నబీ అనిఫోరెన్సిక్ పరీక్షలో నిర్ధారణ అయ్యింది.

హమాస్ తరహా దాడికి ప్లాన్..

డానిష్ విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్  కంటే ముందు వీరు డ్రోన్లు, రాకెట్లతో దాడి చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. 2023లో ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడి తరహా గా దీన్ని ప్లాన్ చేశామని నిందితులు తెలిపారు. డానిష్ ను ఎన్ఐఏ శ్రీనగర్ లో అదుపులోకి తీసుకుంది. ఇతను కారు బాంబును తయారు చేసి ఇవ్వడమే కాక..అంతకు ముందు డ్రోన్లు, రాకెట్ల తయారీలో కూడా టెక్నికల్ గా సపోర్ట్ చేశాడు. కెమెరాలతో పాటు బరువైన బాంబులను మోసుకెళ్లగల పెద్ద బ్యాటరీలతో అమర్చబడిన శక్తివంతమైన డ్రోన్‌లను తయారు చేయడానికి డానిష్ ప్రయత్నించాడని ఎన్ఐఏ చెబుతోంది. అతనికి చిన్న ఆయుధ డ్రోన్లను తయారు చేయడంలో అనుభవం ఉందని తెలిపారు. జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో ఆయుధాలతో కూడానడ్రోన్లను పంపి ప్రాణ నష్టం జరిగేలా చేయాలని ప్లాన్ చేశారని..ఇలాంటి వ్యూహాన్నే అంతకు ముందు హమాస్, సిరియాల్లోని టెర్రరిస్ట్ గ్రూపులు ఉపయోగించాయని చెబుతున్నారు.

డానిష్ ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, పుల్వామా జిల్లా నివాసి. నబీకి చెందిన మరో వాహనాన్ని కూడా NIA స్వాధీనం చేసుకుంది. డాక్టర్ రెహాన్, డాక్టర్ మొహమ్మద్, డాక్టర్ ముస్తకీమ్, ఎరువుల వ్యాపారి దినేష్ సింగ్లా గతంలో ఉమర్‌తో సంబంధాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఢిల్లీ పోలీసులు, జమ్మూ కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇతర ఏజెన్సీలతో కలిసి పనిచేస్తూ, గాయపడిన వారిలో చాలామందితో సహా 73 మంది సాక్షులను ఏజెన్సీ ఇప్పటివరకు విచారించింది. ఈ కేసులో అసలు కుట్రదారులు ఎవరు, దీని వెనుక పెద్ద నెట్‌వర్క్ ఏమైనా ఉందా అనే దానిపై దర్యాప్తు ఇంకా జరుగుతోంది.

Also Read: I Bomma: అవమానాలు భరించలేకే ఐబొమ్మకు రూపం.. రవి గురించి వెలుగులోకి నిజాలు

Advertisment
తాజా కథనాలు