Israel Hamas War: హమాస్ పై ఇజ్రాయెల్ భీకర దాడి..యహ్యా సిన్వర్ సోదరుడు మృతి
హమాస్ కమాండ్ సెంటర్ పై ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఈ భీకర దాడిలో హమాస్ టాప్లీడర్, యాహ్యా సిన్వార్ సోదరుడు మహమ్మద్ సిన్వర్ మృతి చెందినట్లు తెలుస్తోంది.
హమాస్ కమాండ్ సెంటర్ పై ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఈ భీకర దాడిలో హమాస్ టాప్లీడర్, యాహ్యా సిన్వార్ సోదరుడు మహమ్మద్ సిన్వర్ మృతి చెందినట్లు తెలుస్తోంది.
భారత్ దగ్గర 180, పాకిస్తాన్ దగ్గర 170 అణ్వాయుధాలు ఉన్నాయి. అయితే భారత్ ముందుగా అణ్వాయుధాలు ప్రయోగించదు. ఎందుకంటే భారత్ అణు విధానం నో ఫస్ట్ యూస్. కానీ పాక్ మొదట న్యూక్లియర్ దాడి చేసే అవకాశం ఉంది. 2 దేశాలు అణ్వాయుధాలు వాడాలంటే ప్రధాని నిర్ణయం తీసుకోవాలి.
మొట్టమొదటిసారి పాలస్తీనా ప్రభుత్వం హమాస్ కు వ్యతిరేకంగా మాట్లాడింది. హమాస్ కుక్కల్లారా బందీలను విడిచిపెట్టండి అంటూ పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ ఏకంగా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
ఇజ్రాయెల్ చేతిలో దెబ్బతిన్న హమాస్ మరో ప్లాన్ వేసింది.తమ సైన్యంలో చిన్న పిల్లలు, యువతను నియమించుకోవడం ప్రారంభించింది. ఇప్పటికే 30 వేల మంది యువతను 'ఇజ్ అద్ దిన్ అల్ ఖస్సం బ్రిగేడ్'లో చేర్చుకొన్నట్లు సౌదీ అరేబియాకి చెందిన ఓ మీడియా ఛానెల్ తెలిపింది.
గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 14 మంది పాలస్తీనా అత్యవసర సేవల సిబ్బందితో పాటు ఓ ఐరాస ఉద్యోగి మృతి చెందారు.ఈ ఘటనలో సైన్యానికి సంబంధించి వృత్తి పరమైన వైఫల్యాలు చోటు చేసుకున్నట్లు తేలింది.ఈ క్రమంలోనే ఓ డిప్యూటీ కమాండర్ పై సైన్యం వేటు వేసింది
ఈస్టర్ సందర్భంగా తాత్కాలిక కాల్పుల విరమరణ పాటిస్తామని ప్రకటించిన రష్యా ఆ మాటకు కట్టుబడి లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు.ఈస్టర్ కాల్పుల విరమణను గౌరవిస్తున్నట్లు తప్పుడు వైఖరిని ఆ దేశం ప్రదర్శిస్తోందన్నారు.
వీసా, ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో అమెరికా ప్రభుత్వం రోజుకో కొత్త మార్పు తీసుకువస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఎవరైనా గాజా వెళితే వారు యూఎస్ కు రాలేరని కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. పాస్ట్ పోర్ట్ లో గాజా పేరు ఉంటే వారి వీసా క్యాన్సిల్ చేస్తారు.
గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో రెండు చేతులూ కోల్పోయిన ఈ పాలస్తీనా బాలుడు మహమ్మద్ అజ్జౌర్ (9) చిత్రం వరల్డ్ ప్రెస్ ఫొటో ఆఫ్ ది ఇయర్ 2025గా ఎంపికైంది. పాలస్తీనియన్ మహిళా ఫొటోగ్రాఫర్ సమర్ అబు ఎలౌఫ్ ది న్యూయార్క్ టైమ్స్ కోసం ఈ ఫొటో తీశారు.
అక్టోబరు 7 నాటి హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయేల్.. అత్యంత దుర్మార్గపు చర్యలకు తెగబడుతోంది. గాజాను మరుభూమిగా మారుస్తోంది.పాలస్తీనియన్ పౌరులు తిరిగి రావడానికి అక్కడ ఏమీ మిగలదని ఇజ్రాయేల్ సైనికులే చెబుతున్నారు.