Israel-Gaza: గాజాలో మారణహోమం.. టార్గెట్‌ నెరవేరేవరకు వదలమంటున్న ఇజ్రాయెల్

గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడినట్లు ఐక్యరాజ్య సమితి రిపోర్ట్‌ వివరించింది. ఇజ్రాయెల్‌లో ఉన్న అగ్రనాయకులే ఈ దాడులు ప్రోత్సహించారంటూ ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం 72 పేజీల రిపోర్టును విడుదల చేసింది.

New Update
Israel committed genocide in Gaza, UN commission of inquiry says

Israel committed genocide in Gaza, UN commission of inquiry says

గాజాను స్వాధీనం చేసుకునే దిశగా ఇజ్రాయెల్‌ నిరంతరాయంగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. దీనిపై తాజాగా ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్‌ స్పందించారు. తమ దేశ బందీలను హమాస్ చెర నుంచి విడిపించేందుకు తీవ్రస్థాయిలో పోరాడుతున్నామని పేర్కొన్నారు. గాజా తగలబడుతోందని.. ఇజ్రాయెల్ దళాలు ఉగ్రవాదుల స్థావరాలపై ఉక్కు పిడికిలితో విరుచుకుపడుతున్నాయని తెలిపారు. టార్గెట్ పూర్తయ్యేదాకా తాము ఏమాత్రం ఆపేదిలేదని తేల్చిచెప్పారు.  

Also Read: ఖతార్ లో ఇజ్రాయెల్ దాడిపై ఇస్లాం దేశాల సీరియస్.. రక్త దాహాన్ని అడ్డుకోవాలని తీర్మానం

ఇదిలాఉండగా ఇప్పటికే 3.5 లక్షల మంది పాలస్తీనీయులను గాజా స్ట్రిప్‌ నుంచి తరలించామని IDF పేర్కొంది. ఇంకా వేలాదిమంది మిగిలిపోయినట్లు తెలిపింది. IDF దళాలు భూతల ఆపరేషన్‌ను ప్రారంభించినప్పటి నుంచి గాజాను విడిచివెళ్లే వారి సంఖ్య మరింత పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా గాజాను స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్‌ భావిస్తోంది.   

Also Read: పాకిస్థాన్‌ అణు స్థావరాలను నాశనం చేసే ప్రణాళిక.. భారత్‌కు ఇజ్రాయెల్‌ బంపర్ ఆఫర్‌ !

అయితే ఈ ఆపరేషన్‌కు ముందు గాజా స్ట్రిప్‌లో 10 లక్షల మందికి పైగా పాలస్తీనీయులు ఉండేవారు. ఆ తర్వాత భారీగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. కొన్ని రోజుల క్రితమే నగరాన్ని ఖాళీ చేయాలని IDF పాలస్తీనా వాసులకు హెచ్చరికలు జారీ చేసింది. అయితే గత కొంతకాలంగా గాజాపై ఇజ్రాయెల్‌ వైమానికి దాడులు చేస్తూనే ఉంది. దీంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తు్న్నారు. అనేక కుటుంబాలు తమ ఇళ్లల్లో నిద్రపోయేందుకే భయపడుతున్నాయి. 

Also Read: ఆఫీసులో వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య.. కంపెనీకి రూ.90 కోట్ల జరిమానా

ఇక గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడినట్లు ఐక్యరాజ్య సమితి రిపోర్ట్‌ వివరించింది. ఇజ్రాయెల్‌లో ఉన్న అగ్రనాయకులే ఈ దాడులు ప్రోత్సహించారంటూ ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం 72 పేజీల రిపోర్టును విడుదల చేసింది. 2023 అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్ జాతి విధ్వంసకర దాడులకు పాల్పడుతోందని ఐరాస మానవహక్కుల మండలి ఏర్పాటు చేసిన కమిషన్ రిపోర్ట్‌ స్పష్టం చేసింది. 

2023లో అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ మెరుపు దాడులు చేసిన సంగతి తెలసిందే. అయితే ఈ దాడులకు ముందే ఇజ్రాయెల్‌ పాలస్తీనాలోకి సరకు రవాణాను అడ్డుకున్నట్లు ఐరాస రిపోర్ట్ పేర్కొంది. ఇక హమాస్‌ దాడి అనంతరం ఈ రవాణా పూర్తిగా ఆగిపోయిందని.. దీనివల్ల గాజా ప్రజల జీవితం అస్థవ్యస్థంగా మారిందని తెలిపింది. ముఖ్యంగా ఆహారం, నీరు, కరెంట్, మానవతా సాయం దొరకకా అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. 

Advertisment
తాజా కథనాలు