Gaza: గాజాలో కాల్పుల విరమణ తీర్మానం.. అడ్డుకున్న అమెరికా

హమాస్‌ను నిర్మూలించి గాజాను స్వాధీనేందుకు ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగిస్తూనే ఉంది. అక్కడ వెంటనే కాల్పుల విరమణ చేయాలని కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం జరగగా అమెరికా దాన్ని అడ్డుకుంది.

New Update
US vetoes UN Security Council Gaza ceasefire demand for sixth time

US vetoes UN Security Council Gaza ceasefire demand for sixth time

హమాస్‌(Hamas) ను నిర్మూలించి గాజాను స్వాధీనేందుకు ఇజ్రాయెల్‌ దాడులు(Israel Attacks) కొనసాగిస్తూనే ఉంది. అక్కడ వెంటనే కాల్పుల విరమణ చేయాలని కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం జరగగా అమెరికా దాన్ని అడ్డుకుంది. 15 దేశాల సభ్యత్వం ఉన్న ఐరాస భద్రత మండలిలో 14 దేశాలు కాల్పుల విరమణ ఆపేయాని ఓటు వేశాయి. కానీ అమెరికా మాత్రం తనకున్న విటో అధికారంతో దీన్ని అడ్డుకుంది. దీంతో ఆ తీర్మానం ఆగిపోయింది. గాజాలో యుద్ధానికి ముగింపు పలకాలన్న తీర్మానాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమోదయోగ్యం కాని ఈ తీర్మానాన్ని అమెరికా తిరస్కరిస్తోందని భద్రతా మండలిలోని యూఎస్‌ కౌన్సెలర్‌ మోర్గాన్ ఓర్టాగస్‌ తెలిపారు. అమెరికా, ఈయూ ఉగ్రవాద సంస్థగా గుర్తించిన హమాస్‌ అకృత్యాలు ఖండించడంలో ఈ తీర్మానం ఫెయిల్‌ అయినట్లు పేర్కొన్నారు. 

Also Read: భారత సైన్యం మాపై దాడులు చేసింది.. లష్కరే తోయిబా కమాండర్ కీలక వ్యాఖ్యలు

US US Vetoes UN Security Council Gaza Ceasefireetoes

2023 నుంచి గాజాలో వెంటనే కాల్పుల విరమణ చేయాలని ఐరాసాలో సభ్యత్వ దేశాలు తీర్మానం చేస్తునే ఉన్నాయి. కానీ అమెరికా దాన్ని అడ్డుకుంటోంది. ఇప్పటికే ఐదు సార్లు వీటో చేయగా తాజాగా ఆరోసారి అడ్డుకుంది. గాజాలో దాడులు చేసేందుకు ఇజ్రాయెల్‌కు అమెరికా సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 64 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు .  

Also Read: సిటిజెన్ షిప్ కోసమే పెళ్ళి..డెమోక్రటిక్ నేత ఇల్హాన్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

మరోవైపు పాలస్తీనా ఏర్పాటు కోసం సెప్టెంబర్‌ 13 ఐరాసలో మరో తీర్మానం జరిగింది. దీనికి భారత్‌ అనుకూలంగా ఓటు వేసింది. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య శాంతియుత పరిష్కారానికి మద్దతు పలికింది. ఫ్రాన్స్‌ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి మొత్తం 142 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. అన్ని గల్ఫ్‌ దేశాలు ఈ తీర్మానానికి మద్దతు పలికాయి. కానీ ఇజ్రాయెల్, అర్జెంటీనా, హంగేరి, నార్వే లాంటి పలు దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి . 

Also Read: పాకిస్తాన్ కు సౌదీ అరేబియా దన్ను..గల్ఫ్ దేశం సైనిక బలం ఎంతో తెలుసా?

Advertisment
తాజా కథనాలు