/rtv/media/media_files/2025/07/08/trump-netanyahu-2025-07-08-09-16-04.jpg)
Trump-Netanyahu Meeting
గాజా(gaza) లో శాంతి నెలకొల్పేందుకు చాలా రోజులుగా చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. దీని కోసం ఆయన రూపొందించిన 21 సూత్రాల ప్రణాళికకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకరించారు. దీనిని హమాస్ ముందు కూడా ఉంచనున్నారు. ఆ సంస్థ కూడా వీటికి అంగీకారం తెలిపితే..గత రెండేళ్ళుగా జరుగుతున్న యుద్ధానికి తెర పడినట్టే అవుతుంది. నెతన్యాహును ఒప్పించిన ట్రంప్ 21 సూత్రాలు ఏంటి?
Also Read : బంగ్లాదేశ్ లో మళ్ళీ ఉద్రిక్తతలు..ఇండియాలో కలుస్తామంటున్న మైనార్టీలు
21 సూత్రాల శాంతి ప్రణాళిక..
ట్రంప్ రూపొందించిన ప్రణాళిక... గతంలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రతి పాదనల మాదిరిగానే ఉన్నాయని చెబుతున్నారు. అంతకు ముందు యుద్ధం ఆపేందుకు ఏ కండిషన్స్ అయితే పెట్టారో అవి కూడా ఇందులో రూపొందించారని అంటున్నారు. ప్రస్తుతం ట్రంప్ తయారు చేసిన 21 సూత్రాల ప్రణాళిక ఇలా ఉంది.
1. గాజా తీవ్రవాద రహితంగా మారుతుంది. పొరుగు దేశాల నుంచి ఎలాంటి ముప్పూ ఉండదు.
2. గాజాను తిరిగి అభివృద్ధి చేయాలి.
3. ఈ ప్రతిపాదనకు ఇజ్రాయెల్, హమాస్ రెండూ అంగీకరిస్తే..యుద్ధం వెంటనే ముగుస్తుంది. బందీలను వెంటనే విడుదల చేయాలి. దాంతో పాటూ ఇజ్రాయెల్ దళాలు గాజాను వీడి వెళతాయి. ఈ లోపు అన్ని రకాల దాడులు నిలిపివేయబడతాయి. దశల వారిగా ఇజ్రాయెల్ సైన్యం గాజాను వీడి వెళుతుంది.
4. ఈ ఒప్పందాన్ని అంగీకరించిన 72 గంటల్లోపు బందీలను సజీవంగా అప్పగించాలి.
5. హమాస్ బందీలను విడవగానే..ఇజ్రాయెల్ కూడా తమ ఆధీనంలో ఉన్న 250 మంది జీవిత ఖైదఈలను, 2023 అక్టోబర్లో నిర్భంధించిన 1700 మంది గాజా వాసులను విడుదల చేస్తుంది. మరణించిన వారి అవశేషాలను సైతం తిరిగి ఇస్తుంది.
6. బందీల విడుదల తర్వాత హమాస్ తమ ఆయుధాలను ఉపసంహరించుకోవాలి. శాంతికి కట్టుబడి ఉండాలి. అలాగే వారికి క్షమాభిక్ష్ ఇవ్వబడుతుంది. గాజాను విడిచి వారు వేరే ప్రాంతాలకు సురక్షితంగా వెళ్ళే అవకాశం కల్పించబడుతుంది.
7. గాజాకు పూర్తి సహాయాన్ని పంపిస్తారు. మౌలిక సదుపాయాలన్నింటినీ తిరిగి కల్పిస్తారు. గాజాను పూర్తిగా బాగు చేసి మునుపటి పరిస్థితిని తిరిగి తీసుకువస్తారు .
8. గాజాను సాంకేతిక, రాజకీయేతర పాలస్తీనా కమిటీ తాత్కాలిక పరివర్తన పాలన కింద పరిపాలిస్తుంది. గాజాలోని ప్రజలకు ప్రజా సేవలు, మునిసిపాలిటీల రోజువారీ నిర్వహణను అందించే బాధ్యత దీనిదే. 9.ఈ కమిటీ అర్హత కలిగిన పాలస్తీనియన్లు, అంతర్జాతీయ నిపుణులతో కూడి ఉంటుంది. ఇందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పాటూ బోర్డ్ ఆఫ్ పీస్ పర్య వేక్షణ, టోనీ బ్లెయిర్ తో సహా ఇతర దేశాధినేతలు కూడా సభ్యులుగా ఉంటారు.
10. నిపుణుల బృందాలతో గాజాను తిరిగి పునర్నిర్మిస్తారు. ఇక్కడి ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేయడానికి ట్రంప్ ప్రణాళికను రూపొందిస్తారు.
11. కొత్త సుంకాలు, యాక్సెస్ రేట్లతో ప్రత్యేక ఆర్థిక మండలిని ఏర్పాటుట చేస్తారు.
12. గాజాను వదిలి వెళ్ళమని ఎవరినీ బలవంతం చేయరు. వెళ్ళిపోవాలనుకునే వారు స్వేచ్ఛగా వెళ్ళవచ్చు...మళ్ళీ తిరిగి రావచ్చు.
13. హమాస్ కానీ ఏ ఇతర వర్గాలు కానీ గాజా పాలనలో వేలు పెట్టకూడదు. సొరంగాలు, ఆయుధ ఉత్పత్తి సౌకర్యాలతో సహా అన్ని సైనిక, ఉగ్రవాద మౌలిక సదుపాయాలు నాశనం చేయబడతాయి.
14.మానిటర్ల పర్యవేక్షణలో గాజాలో సైనికీకరణను తొలగించే ప్రక్రియ ఉంటుంది. ఇందులో అంగీకరించబడిన డీకమిషన్ ప్రక్రియ ద్వారా ఆయుధాలను శాశ్వతంగా ఉపయోగించకుండా ఉండేలా చేస్తారు.
15. హమాస్ లేదా ఇతర సంస్థలు మళ్ళీ దాడులు చేయవని గాజా ప్రాంతీయ భాగస్వాములు హామీ ఇస్తారు.
16. గాజాలో తక్షణమే మోహరించడానికి తాత్కాలిక అంతర్జాతీయ స్థిరీకరణ దళం (ISF)ను అభివృద్ధి చేయడానికి యునైటెడ్ స్టేట్స్ అరబ్ మరియు అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పని చేస్తుంది.ISF గాజాలో తనిఖీ చేయబడిన పాలస్తీనా పోలీసు దళాలకు శిక్షణ ఇస్తుంది . ISF ఇజ్రాయెల్ , ఈజిప్ట్ తో కలిసి పని చేస్తుంది.
17. ఇజ్రాయెల్ గాజాను ఆక్రమించదు లేదా స్వాధీనం చేసుకోదు.
18.ఇజ్రాయెల్ దళాలు క్రమంగా తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటాయి. కానీ గాజా చుట్టుపక్కల మాత్రం ఉంటారు. మళ్ళీ దాడులు జరిగితే వెంటనే స్పందించడానికి మాత్రమే ఇవి పని చేస్తాయి.
19. హమాస్ ఈ ప్రతిపాదనను ఆలస్యం చేసినా లేదా తిరస్కరించినా.. ఐడీఎఫ్ తిరిగి గాజాలో కొనసాగుతుంది.
20. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య శాంతి నెలకొల్పేందుకు ఒక మతాంతర సంభాషణ ప్రక్రియ ఏర్పాటు చేస్తారు.
21. ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి పునరుద్ధరణ కోసం అమెరికా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది.
Also Read: Bangladesh: బంగ్లాదేశ్ లో మళ్ళీ ఉద్రిక్తతలు..ఇండియాలో కలుస్తామంటున్న మైనార్టీలు