GAZA: ఐదుగరు జర్నలిస్టులను చంపేసిన ఇజ్రాయెల్ సైన్యం..హమాస్ టెర్రరిస్టులని నెపం

గాజాలో అల్ జజీరాకు చెందిన ఐదుగురు జర్నలిస్టులను  చంపేసింది ఐడీఎఫ్. వీరిలో ఒకరు హమాస్ ఉగ్రవాదని...అతను జర్నలిస్టుగా నటిస్తున్నాడని ఐడీఎఫ్ వాదిస్తోంది.  జర్నలిస్టుల మృతి అల్ జజీరా ఛానెల్ కూడా ధృవీకరించింది.

New Update
AL Jazeera

Journalists Died In Gaza Attack

గాజాలో ఇజ్రాయెల్ సైన్యం ఆగడాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. ఆ నగరానికి విముక్తి కల్పిస్తామని నెతన్యాహు చెబుతున్నారు. అక్కడ హమాస్ ను సమూలంగా నాశనం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. దానికి తగ్గట్టే ఐడీఎఫ్ గాజాలో దాడులు నిర్వహిస్తోంది. తాజాగా జరిగిన దాడుల్లో ఐదుగురు అల్ జజీరా జర్నలిస్టులను చంపేశారు. అల్ జజీరా కరస్పాండెంట్లు అనాస్ అల్-షరీఫ్, మొహమ్మద్ క్రీఖే, అలాగే కెమెరామెన్ ఇబ్రహీం జహెర్, మోమెన్ అలీవా, మొహమ్మద్ నౌఫాల్ లు ఉన్నారు.  అల్ షిఫా హాస్పిటల్ మెయిన్ గేట్ దగ్గర ప్రెస్ కోసం వేసిన టెంట్ మీద ఇజ్రాయెల్ సైన్యం అటాక్ చేసింది. ఇందులో మొత్తం ఏడుగురు మరణించగా..అందులో ఐదుగురు జర్నలిస్టులు. ఈ దాడిని తామే చేశామని ఐడీఎఫ్ ప్రకటించింది. అయితే జర్నలిస్టులలో ఒకరు హమాస్ ఉగ్రవాదని సైన్యం తెలిపింది. హమాస్ ఉగ్రవాది ఒకరు జర్నలిస్ట్ గా వ్యవహరిస్తూ తప్పించేుకుని తిరుగుతున్నాడని అందుకే చంపామని తన దాడిని సమర్ధించుకుంది. 

నా గొంతు అణిచివేశారు..

దాడిలో చనిపోయిన అనాస్ అల్ షరీఫ్ అనే వ్యక్తి హమాస్ ఉగ్రవాదని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. హమాస్‌లోని ఉగ్రవాద విభాగానికి అధిపతిగా పనిచేశాడని అంటోంది. ఇతని వయసు 28 ఏళ్ళు. కరెక్ట్ గా దాడికి ముందు షరీఫ్ తన ఎక్స్ లో గాజాలో ఇజ్రాయెల్ బాంబు దాడులను తీవ్రతరం చేసిందని పోస్ట్ చేశాడు. షరీఫ్ చనిపోయిన వెంటనే ఈ పోస్ట్ ఎక్స్ లో కనిపించింది. తన చావును అతను ముందుగానే ఊహించి రాసాడని...ఆ తర్వాత వేరే ఫ్రెండ్ ద్వారా పోస్ట్ చేయబడిందని చెబుతున్నారు. నా పోస్ట్ కనుక మీరు చూస్తే అప్పటికే నా గొంతు అణివేయబడిందని మీరు భావించండి అంటూ అల్ షరీఫ్ పోస్ట్ లో రాశారు. మరోవైపు గాజాలో 22 నెలల యుద్ధంలో జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని జరిగిన తాజా దాడి ఇదేనని, ఈ సంఘర్షణలో దాదాపు 200 మంది మీడియా ఉద్యోగులు మరణించారని మీడియా వాచ్‌డాగ్‌లు తెలిపాయి.

కన్ఫామ్ చేసిన అల్ జజీరా..

గాజాలో జరిగిన దాడిలో తమ జర్నలిస్టులు ఐదుగురు మరణించారని అల్ జజీరా ఛానెల్ కన్ఫామ్ చేసింది.  ఈ వార్తను ప్రసారం చేస్తూ వారి సహచరుడు భావోద్వేగానికి గురైయ్యారు. అతను కన్నీళ్ళతో వార్తను ప్రకటించారు. 

Also Read: BIG BREAKING: డేంజర్ లో మరో ఎయిర్ ఇండియా ఫ్లైట్.. విమానంలో కాంగ్రెస్ అగ్రనేత!

Advertisment
తాజా కథనాలు