Isarel:మళ్లీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 59 మంది పాలస్తీనీయులు మృతి
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా డెయిర్ అల్ బలాలో ఆహారం కోసం సహాయక కేంద్రం వద్ద ఉన్నవాళ్లపై కాల్పులకు దిగింది. ఈ దాడుల్లో 59 మంది పాలస్తీనీయులు మృతి చెందారు.
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా డెయిర్ అల్ బలాలో ఆహారం కోసం సహాయక కేంద్రం వద్ద ఉన్నవాళ్లపై కాల్పులకు దిగింది. ఈ దాడుల్లో 59 మంది పాలస్తీనీయులు మృతి చెందారు.
గత 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో 94 మంది మృతి చెందారు. గాజా ఆరోగ్యశాఖ గురువారం ఈ విషయాన్ని ప్రకటించింది. మానవతా సాయం అందిస్తున్న పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన కాల్పుల్లోనే 45 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే షరతులు ఎలాంటివనేది మాత్రం వివరించలేదు.
గాజాలో పరిస్థితి ఘోరంగా ఉంది. తినడానికి తిండిలేక అక్కడ ఇసుక తింటున్నామని ఓ బాలుడు ఆవేదనతో ఏడుస్తూ మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది. 24 గంటలకు ఓసారి వచ్చే ఫుడ్ ట్రక్కులపై ఆంక్షలు ఉండటంతో దిక్కుతోచని పరిస్థితిలో గాజా ప్రజలు ఉన్నారు.
గాజాలో మానవతా సాయం అందించడం కోసం స్వీడిష్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ను ఇజ్రాయెల్ సైన్యం సోమవారం అదుపులోకి తీసుకుంది. అయితే తాజాగా ఆమెను దేశం నుంచి వెనక్కి పంపించామని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
గాజాపై ఇజ్రాయెల్ ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు భీకర దాడులు చేస్తోంది. తాజాగా ఓ సంచలన వీడియో బయటపడింది. ఖాన్ యూనస్‌లోని ఓ కీలకమైన ఆస్పత్రి కిందే హమాస్ సొరంగాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ దళం వెల్లడించింది.
ఇజ్రాయెల్ ఏమాత్రం తగ్గడం లేదు. గాజాపై భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇటీవల ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో దాదాపు 100 మంది పాలస్తీనియన్లు దుర్మరణం చెందారు. 440 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
గాజాలో మానవతా సహాయ కేంద్రం వద్ద ఇజ్రాయెల్ దళాలు మరోసారి దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్ది ప్రజలు గాయాలపాలయ్యారు. గత 3 రోజుల నుంచి సహాయ కేంద్రాల వద్ద ఈ దాడులు జరుగుతున్నాయి.