/rtv/media/media_files/2025/08/25/attack-on-hospital-2025-08-25-14-26-22.jpg)
attack on hospital
ఇజ్రాయిల్ గాజాపై మారణఖాండ కొనసాగిస్తూనే ఉంది. సోమవారం గాజాలోని నాసర్ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు జర్నలిస్టులు సహా 15 మంది మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. చనిపోయినవారిలో రాయిటర్స్ జర్నలిస్ట్ హతేమ్ ఖలీద్ ఒకరు. అలాగే స్థానికంగా ఉండే అతని ఫోటోగ్రాఫర్ కూడా అని అధికారులు తెలిపారు.
Graphic footage from the Israeli attack on Nasser Hospital in southern Gaza's Khan Younis shows a strike hitting rescue workers following an initial strike.
— Emanuel (Mannie) Fabian (@manniefabian) August 25, 2025
The IDF has not yet commented.
According to Palestinian media, at least 14 were killed in the strikes, including three… pic.twitter.com/GMFCrl0qOK
గత వారం, ఇజ్రాయెల్ ఆర్మీ గాజా సిటీని స్వాధీనం చేసుకునే ఆపరేషన్ మొదటి దశలను ప్రకటించింది. పదివేల మంది రిజర్విస్టులను పిలిపించింది, అయితే బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం దాదాపు రెండు సంవత్సరాల యుద్ధాన్ని నిలిపివేయడానికి కొత్త కాల్పుల విరమణ ప్రతిపాదనను పరిగణించింది.