/rtv/media/media_files/2025/07/17/netanyahu-1-2025-07-17-07-07-23.jpg)
Isreal PM Netanyahu
హమాస్ మీద ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టి దాదాపు రెండు ఏళ్ళు అవుతోంది. అప్పటి నుంచి గాజాపై దాడులు చేస్తూనే ఉంది. దీనిలో ఇప్పటి వరకు 61 వేల మంది మృతి చెందారు. అయితే హమాస్ చెరలో ఇంకా 50 మంది ఇజ్రాయెలీలు మాత్రం బందీలుగానే ఉండిపోయారు. వీరి కోసం ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొత్త ప్లాన్ వేస్తున్నారు. ఏకంగా గాజానే స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ ప్రతిపాదనను అక్కడ పార్లమెంటులో పెట్టాలని కూడా నిర్ణయించుకున్నారు. దీనిపై ఐడీఎఫ్ వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. అయినా కూడా నెతన్యాహు మాత్రం ముందుకెళ్లాలనే అనుకుంటున్నారని తెలుస్తోంది. గాజాలో బందీలు ఉన్న చోట సైనిక ఆపరేషన్లు చేపట్టాలి..ఒకవేళ దానికి ఒప్పుకోకపోతే డిఫెన్స్ చీఫ్ రాజీనామా చేయాలని నెతన్యాహు ఒత్తిడి తీసుకువస్తున్నారు.
ట్రంప్ కు లేఖ రాసిన మాజీ అధికారులు, నేతలు
అయితే నెతన్యాహు ప్లాన్ కు ఐడీఎఫ్ తో పాటూ ఇజ్రాయెల్ లో ఇతర నేతలూ అంగీకరించడం లేదు. ఇలా చేస్తే బందీలు మరింత ప్రమాదంలో పడతారని అంటున్నారు. అలాగే హమాస్ హమాస్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసేందుకు చాలా ఏళ్ళు పట్టొచ్చని చెబుతున్నారు. దీనిపై దాదాపు 600 మంది రిటైర్డ్ డిఫెన్స్ అధికారులు, నిఘా వర్గాల అధిపతులు అమెరికా అధ్యక్షుటు ట్రంప్ కు లేఖ కూడా రాసారు. నెతన్యాహును ఆపాలని ఆయనను కోరారు. కాల్పుల విరమణకు ఒత్తిడి తీసుకొస్తున్న మిత్రదేశాలను ఈ పరిణామాలు మరింత ఆగ్రహానికి గురిచేయొచ్చని అంచనా వేస్తున్నారు. నెతన్యాహు ప్లన్స్ వలన బందీలతో పాటూ ఇజ్రాయెల్ కూడా వినాశనం అవుతుందని మాజీలు భయపడుతున్నారు. ట్రంప్‌నకు రాసిన లేఖలో.. మొసాద్ మాజీ చీఫ్ తామీర్ పార్దో, షిన్ బెట్ మాజీ చీఫ్ అమీ అయలోన్, మాజీ ప్రధాని ఎహుద్ బరాక్, రక్షణశాఖ మాజీ మంత్రి మోషే యాలోన్ తదితరులు ఉన్నారు.
Also Read: Russia-USA: ట్రంప్ తొందరపాటు..అణు ఒప్పందం నుంచి రష్యా ఔట్..
నెతన్యాహును సరైన దిశలో నడిపించగల వ్యక్తి ట్రంప్ ఒక్కరే అని మాజీ అధికారులు, ఇజ్రాయెల్ ఇతర నేతలు భావిస్తున్నారు. ట్రంప్ కలుగజేసుకుని గాజా యుద్ధాన్ని ముగించేలా చేయాలని కోరుతున్నారు. బందీలను విడిపించేలా చర్యలు తీసుకోవాలని అడుగుతున్నారు. ఒకవైపు బందీలు తమ దీనస్థితికి సంబంధించి వీడియోలు బయటపెడుతుంటే..మరోవైపు నెతన్యాహు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైన విషయం కాదని భావిస్తున్నారు. ఐడీఎఫ్ కూడా ప్రధాని నిర్ణయానికి వ్యతిరేకిస్తోంది.
పాక్షిక కాల్పులు విరమణ..
ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజాలో తీవ్ర దుర్భర పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తిండి లేక అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆహారం కోసం సహాయక కేంద్రాల వద్ద ఎగబడుతున్నారు. మరికొందరికి ఆహారమే దొరకడం లేదు. ఇటీవలే ఆకలితో అలమటించి 100 మందికి పైగా మ-ృతి చెందారు. గాజాలో పెరుగుతున్న ఆకలి మరణాలపై ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ కాస్త దిగొచ్చింది. పాక్షిక కాల్పుల విరమణను ప్రకటించింది.
Also Read: Cricket: వర్క్ లోడ్ సాకు ఇక చెల్లదు..బీసీసీఐ కొత్త నిర్ణయం