Isreal-Gaza: గాజాపై భీకర దాడులు 47 మంది మృతి.. హెచ్చరికలు జారీ చేసిన ఇజ్రాయెల్!

గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు జరుపుతోంది. తాజాగా జరిపిన ఈ దాడుల్లో సుమారుగా 47 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ దాడులు పెరుగుతాయని గాజా నగరంలో ఉన్న ప్రజలు ఈ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది.

New Update
Gaza

Gaza

గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు జరుపుతోంది. తాజాగా జరిపిన ఈ దాడుల్లో సుమారుగా 47 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ దాడులు పెరుగుతాయని గాజా నగరంలో ఉన్న ప్రజలు ఈ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. గాజా వాసులకు మువాసీ శరణార్థి శిబిరంలో అన్ని ఏర్పాట్లు చేశామని అందరూ అక్కడికి వెళ్లాలని  ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి అవిచే అద్రాయీ తెలిపారు.

ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి...11 మంది మృతి

ఇజ్రాయెల్ సైన్యంలోకి వేల మంది..

ఈ దాడులు పెరగడంతో ఇజ్రాయెల్ వేల మందికి సైన్యంలోకి చేర్చుకుంటుంది. అయితే గాజాపై యుద్ధం చేస్తుండంతో సైన్యంలో చేరేందుకు ఇజ్రాయెల్ యువత ఆసక్తి చూపడం లేదు. అయితే ఇజ్రాయెల్‌లో ఉన్న ప్రతి యువకుడు పదేళ్లపాటు సైన్యంలో రిజర్విస్టుగా పనిచేయాలనే నిబంధన ఉంది. అయితే గాజా యుద్ధం రాజకీయ లక్ష్యాలను సాధించడానికి జరుగుతోందని, హమాస్‌ను నాశనం చేయడానికి కాదని కొందరు భావిస్తున్నారు. ఈ క్రమంలో వారు టెల్ అవీవ్‌లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ నిరసనలు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి కొత్త సవాలుగా మారాయి.

గాజా, ఇజ్రాయెల్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. భీకర యుద్ధాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందరో తమ ఇళ్లు, కుటుంబాలను కోల్పోయారు. తిండి, వైద్య సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతర్జాతీయ సంస్థలు సహాయ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ దాడుల వల్ల వాటికి ఆటంకాలు కలుగుతున్నాయి. ఇరువైపుల నుంచి కాల్పుల విరమణ కోసం ప్రపంచ దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. కానీ ఈ యుద్ధం ప్రస్తుతానికి ముగిసే సూచనలు కనిపించడం లేదు. పాలస్తీనా ప్రజల కష్టాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇకనైనా యుద్ధం ఆపితే గాజా ప్రజలకు సమస్యలు తగ్గుతాయి. 

ఇది కూడా చూడండి: National Guards: షికాగో చాలా ప్రమాదకరంగా ఉంది..రక్షణ అవసరం..ట్రంప్

Advertisment
తాజా కథనాలు