Israel-Hamas: ఖతార్ లో ఇజ్రాయెల్ దాడి.. హమాస్ నేతలే టార్గెట్

ఖతార్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. హమాస్ నేతలే లక్ష్యంగా సమ్మిట్ ఆఫ్ ఫైర్ పేరుతో దోహాలో బాంబు దాడిచేసింది. ఇందులో హమాస్‌ కీలక నేత ఖలీల్‌ అల్‌-హయ్యా కుమారుడు సహా ఆరుగురు మృతి చెందారు.

New Update
khatar

Israel Attack On Khatar

గాజా(gaza) లో కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించేందుకు ఖతార్(Katar) లోని దోహాలో సమావేశమైన హమాస్ నేతలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దీనికి సమ్మిట్ ఆఫ్ ఫర్ అని పేరు పెట్టింది. హమాస్ నేతలే టార్గెట్ అని ఇజ్రాయెల్ బహిరంగంగా అనౌన్స్ కడా చేసింది. అయితే ఈ దాడిలో ఖతార్ అధికారులు ఎవరూ మరణించలేదు. కానీ హమాస్‌ కీలక నేత ఖలీల్‌ అల్‌-హయ్యా కుమారుడు సహా ఆరుగురు మృతి చెందారు. అయితే చనిపోయిన వారిలో ఖతార్ అధికారి కూడా ఒకరున్నారని తెలుస్తోంది. మరోవైపు తమ నేతలంతా క్షేమమేనని హమాస్ ప్రకటించింది. 

Also Read :  భారత్ తో సుంకాలపై చర్చలు.. మోదీతో కూడా మాట్లాడతా అంటున్న ట్రంప్..

ఇదొక పిరికి చర్య..ఖతార్

ఇజ్రాయెల్ ఖతార్ పై దాడి చేస్తుందని తమకు తెలుసునని అమెరికా చెబుతుండగా..ఐక్యరాజ్య సమితితో పాటూ మిగతా దేశాలన్నీ ఈ చర్చను ఖండిస్తున్నాయి. ఇదొక పిరికి చర్య అని ఖతార్ అంటోంది. ఇలాంటి అనూహ్య దాడులు చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖతార్ లోని అమెరికన్ కాన్సులేట్ కు దగ్గరలో ఉన్న బిల్డింగ్ లో హమాస్ పొలిటికల్ బ్యూరో నేతలు సమావేశమయ్యారు. దీనిపై ఇజ్రాయెల్ కు ముందుగానే సమాచారం ఉంది. అందుకే పక్కా ప్లాన్ ప్రకారం వారు సమావేశం అయిన భవనంపై ఇజ్రాయెల్ బాంబుతో దాడి చేసింది. దీంతో బిల్డింగ్ ముందు భాగం నేలమట్టం అయింది. తమ వైమానిక దళం ఈ దాడి చేసిందని ఇజ్రాయెల్‌ సైన్యం అధికార ప్రతినిధి అవిచయ్‌ అడ్రాయీ తెలిపారు. ప్రధాని నెతన్యాహూ కూడా దాడిని ధ్రువీకరించారు. దాడికి బాధ్యత తమదేనని అన్నారు. అదనపు నిఘా సమాచారంతోనే దాడి చేశామని చెప్పారు. 

మరోవైపు గాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్(israeli-strike) చాలా రోజులుగా చెబుతోంది. మంగళవారం మరోసారి హెచ్చరించింది. హామాస్ పూర్తిగా నాశనం చేసేందుకు వారి ఆఖరి స్థావరాలపై కూడా దాడులు చేస్తామని.. అందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. గడచిన రెండు రోజుల్లో గాజా సిటీలోని 50 వరకూ భవనాలను కూల్చేశామని తెలిపింది. దీంతో గాజావాసులు మరో ఛాయిస్ లేక అక్కడి నుంచి తరలి వెళుతున్నారు. 

Also Read :  నేపాల్ ఘర్షణలపై స్పందించిన ప్రధాని మోదీ

Advertisment
తాజా కథనాలు