HYD: ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం
ఎప్పుడూ రద్దీగా ఉండే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర కొద్దిసేపటి క్రితం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ కింద విశ్వేశ్వరయ్య భవన్ వైపు పార్క్‌లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి.
ఎప్పుడూ రద్దీగా ఉండే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర కొద్దిసేపటి క్రితం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ కింద విశ్వేశ్వరయ్య భవన్ వైపు పార్క్‌లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి.
నంద్యాల జిల్లా చాపిరేవుల గ్రామంలో ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద మృత దేహాలను వెలికితీశారు.
నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో భారతమాత ఫౌండేషన్ నిర్వహించిన ‘భరతమాతకు మహా హారతి’ కార్యక్రమంలో అపశ్రుతి దొర్లింది. టపాసులు పేలుస్తున్న క్రమంలో నిప్పు రవ్వలు బోట్లపై పడి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ యువకుడు మిస్సయ్యాడు.
హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. పీపుల్ ప్లాజా గ్రౌండ్స్ లో నిర్వహించిన భరతమాతకు మహా హారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఇందులో రెండు బోట్లు కాలి దగ్ధమయ్యాయి.
ఏపీలోని ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బైరావపట్నం వద్ద నివసిస్తున్న సంచార జాతులకు చెందిన దాదాపు పది గుడిసెలు దగ్ధం అయ్యాయి. చంటి పిల్లవాడికి పాలు కాద్దామని గ్యాస్ స్టవ్ అంటించగా అకస్మాత్తుగా మంటలు ఎగసిపడినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలో జల్గావ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పరండా రైల్వేస్టేషన్ సమీపంలో పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వస్తున్నాయని ఒకరు చైన్ లాగారు. దీంతో పలువరు ప్రయాణికులు భయంతో పక్కనున్న ట్రాక్‌పై దూకారు. వాళ్లని మరో రైలు ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు.
తుర్కియేలోని కర్టల్ అనే హోటల్ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 66 మంది మృతి చెందారు. మరో 51 మంది గాయాలపాలయ్యారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం నిర్మించిన గూడారాల్లో మంటలు చెలరేగడంతో భక్తులంతా ప్రాణ భయంతో పరుగులు తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టం గురించి తెలియాల్సివుంది.
ఏపీలో ఘోర బస్సు ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి తిరువూరు వస్తున్న ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది.ఆ సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నారు