/rtv/media/media_files/2025/05/19/RyrKQUFESf2KBMj8hHGL.jpg)
వేసవి ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువగా ఉండటంతో తరుచుగా అగ్ని ప్రమాదాలు సంభిస్తున్నాయి. అందులో ఎక్కువగా షాక్ సర్క్యూట్, ఏసీ కంప్రెషజర్ బ్లాస్ట్ కారణంగానే ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ముంబైలోని నారిమన్ పాయింట్‌లోని మహారాష్ట్ర అసెంబ్లీ (విధాన భవన్) వద్ద సోమవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. దీనితో కొద్దిసేపు ఆందోళన ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. సెక్యురిటీ స్కానింగ్ మిషన్ నుంచి మంటలు వచ్చాయి.
VIDEO | Fire breaks out at Maharashtra Assembly due to a short circuit. More details awaited.
— Press Trust of India (@PTI_News) May 19, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/JgyJ5sU4LN
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు సంభవించి ఉంటాయని భావిస్తున్నారు. విధాన్ భవన్ కాంప్లెక్స్ గ్రౌండ్-ఫ్లోర్ ఎంట్రీ చెకింగ్ రూమ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఎలక్ట్రికల్ వైరింగ్, ఇన్‌స్టాలేషన్‌లు, స్విచ్‌బోర్డ్‌లు దెబ్బతింది. అదృష్టవశాత్తూ మంటలు ఈ ప్రాంతానికే పరిమితమయ్యాయి. అసెంబ్లీ బిల్డింగ్‌కు ఎలాంటి భారీ నష్టం జరగక ముందే మంటలు ఆర్పివేశారు. కొద్దిసేపు అంతరాయం ఉన్నప్పటికీ అసెంబ్లీలో శాసనసభ కార్యకలాపాలు షెడ్యూల్ ప్రకారం కొనసాగాయి. ఆ రోజు కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపలేదు.
#WATCH | Mumbai: A fire broke out in the security scanning machine at the Maharashtra Assembly. The cause fire is reported to be a short circuit. Further details awaited. pic.twitter.com/PR9kTzVlcN
— ANI (@ANI) May 19, 2025
మధ్యాహ్నం 3 గంటలకు మంటలు చెలరేగాయని సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బంది ఆరు నిమిషాల్లోనే వాటిని అదుపులోకి తెచ్చింది. మంటలు బిల్డింగ్‌లో చుట్టుపక్కల రూమ్‌లకు వ్యాపించకుండా చూసుకున్నారు. బిల్డింగ్ నుంచి దట్టమైన పొగ వెలువడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రజలు ఆందోళనకు గురైయ్యారు. అగ్ని ప్రమాదం చిన్నదేనని, అసెంబ్లీలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించలేదని అధికారులు వివరణ ఇచ్చారు.
(Mumbai fire breaks | maharashtra assembly election | Nariman Point | fire accident | latest-telugu-news | assembly)