/rtv/media/media_files/2025/05/18/asEagBawRF6IZCseEJsx.jpg)
Hyderabad Gulzar House fire accident sensational facts
Hyd Fire accident: హైదరాబాద్ గుల్జార్ హౌస్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై అధికారులు సంచలన విషయాలు బయటపెట్టారు. 17 మంది చనిపోవడానికి కారణం ఇంటి యజమాని, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే అన్నారు. మొదట ఏసీ పేలడంతో ప్రమాదం జరిగిందని అంచనా వేసినా.. తర్వాత షార్ట్ సర్యూట్ కారణమని తెలిపారు. ఫైర్ ఎగ్జిస్ట్ లేకపోవడం, చెక్క ప్యానెళ్లు ఉండటం వల్లే ఈ ఘోరం జరిగిందని చెప్పారు.
Also Read: రాకెట్ ప్రయోగం ఫెయిలయితే.. ఉపగ్రహాల శకలాలు ఎక్కడ పడతాయో తెలుసా ?
'పెద్ద ఇంటికి ఒక్కటే దర్వాజ విశాలంగా ఉంది. లోపల చాలా ఇరుగ్గా ఉంది. మెట్లు కూడా సరిగ్గా లేవు. ప్రమాదం జరిగినప్పుడు అందరూ నిద్రలో ఉన్నారు. ఆ కారణంతోనే సరిగా బయటపడలేకపోయారు. షాక్ నుంచి తేరుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫైర్ ఎగ్జిస్ట్ లేని కారణంగానే ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందగా మరో 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, నలుగురు చిన్నారులు, మిగిలిన వారంతా పురుషులే ఉన్నారు' అని ఫైర్ డీజీ నాగిరెడ్డి తెలిపారు.
Also Read: కంటెంట్ క్రియేటర్ల కోసం గ్లోబల్ కాంటెస్ట్...50,000 డాలర్ల బహుమతి
ఇక ఘటనా స్థలాన్ని పరిశీలిస్తే ఈ ప్రమాదం ఎసీ కంప్రెసర్ పేలడం వల్ల జరిగింది కాదని, షార్ట్స్ సర్క్యూటే కారణం అని స్పష్టం చేశారు. స్థానికంగా పని చేసేవారు రెగ్యులర్‌గా షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని చెప్పారని తెలిపారు. ఇంటి లోపల ఫైర్ నిబంధనలు లేవని, ఈ బిల్డింగ్ జీప్లస్ 2 కానీ బయటకు జీప్లస్ 1లాగా కనిపిస్తోందన్నారు. ప్రమాదం జరిగిన బిల్డింగ్ చాలా పాతది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు లేకపోవడం భారీ అగ్నిప్రమాదం జరిగిందని చెప్పారు.