BREAKING: అగ్ని ప్రమాద బాధితులకు రూ.25 లక్షల పరిహారం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

చార్మినార్‌లో అగ్ని ప్రమాద బాధితులను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. చనిపోయిన వారికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా సరిపోదని.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.25 లక్షలు అయినా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

New Update
ktr and rr

ktr

హైదరాబాద్ చార్మినార్‌లో గుల్జార్ ఘటనలో 17 మంది మృతి చెందారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ గుల్జార్ వెళ్లి పరామర్శించారు. ఈ ఘటనతో అయినా రాష్ట్రం మేల్కోవాలని అన్నారు. చార్మినార్ దగ్గరకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఉంటే సహాయక చర్యలు ఇంకా తొందరగా జరిగేవని కేటీఆర్ అన్నారు. అందాల పోటీల మీద పెట్టిన ఖర్చు వీటిపైన పెట్టండని కేటీఆర్ కోరారు.

ఇది కూడా చూడండి: KL Rahul: టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన KL రాహుల్.. జీటీపై భారీ సెంచరీ!

రూ.5 లక్షలు సరిపోవని..

రాజకీయాలు కాదని.. ప్రజలు ప్రాణాలు కాపాడాలన్నారు. ఇకనైనా అగ్ని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చనిపోయిన వారికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా సరిపోదన్నారు. కనీసం రూ.25 లక్షలు అయినా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సరైన సమయానికి ఫైర్ ఇంజిన్లు వచ్చిన వాటర్ లేవు. అంబులెన్స్‌లో ఆక్సిజన్ లేకపోవడం వల్ల బాధితులను కాపాడాలేకపోయారని కేటీఆర్ అన్నారు. 

ఇది కూడా చూడండి: West Indies: వెస్టిండీస్‌కు కొత్త కెప్టెన్.. 2 ఏళ్ల విరామం తర్వాత సారథిగా జట్టులోకి!

ఇదిలా ఉండగా హైదరాబాద్‌ గుల్జార్ హౌస్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 17 చనిపోయారు. అయితే వీరు చనిపోవడానికి కారణం ఇంటి యజమాని, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమేని అధికారులు చెబుతున్నారు. మొదట ఏసీ  పేలడంతో ప్రమాదం జరిగిందని అంచనా వేసినా.. తర్వాత షార్ట్ సర్యూట్ కారణమని తెలిపారు. ఫైర్ ఎగ్జిస్ట్ లేకపోవడం, చెక్క ప్యానెళ్లు ఉండటం వల్లే ఈ ఘోరం జరిగిందని విచారణలో తేలింది.

ఇది కూడా చూడండి: Indian Army : సైన్యానికి కీలక అధికారులు..కేంద్రం నిర్ణయం

పెద్ద ఇంటికి ఒక్కటే దర్వాజ విశాలంగా ఉండటం వల్ల లోపల చాలా ఇరుగ్గా ఉంది. మెట్లు కూడా సరిగ్గా లేవు. ప్రమాదం జరిగినప్పుడు అందరూ నిద్రలో ఉన్నారు. ఆ కారణంతోనే సరిగా బయటపడలేకపోయారని అధికారులు చెబుతున్నారు. షాక్ నుంచి తేరుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫైర్ ఎగ్జిస్ట్ లేని కారణంగానే  ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందగా మరో 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, నలుగురు చిన్నారులు, మిగిలిన వారంతా పురుషులే ఉన్నారని అధికారులు తెలిపారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు