Hyd Fire accident: గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదానికి కారణమదే.. సంచలన విషయాలు వెల్లడించిన అధికారులు

పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించిన విషయం తెలిసిందే. కాగా ప్రమాదానికి ఏసీ కంప్రెషర్‌ పేలుడే కారణమని తేల్చారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఏసీలు నిరంతరాయంగా నడుస్తున్నాయని దీనివల్ల ఒత్తిడి ఎక్కువై పేలిపోయాయని అధికారులు గుర్తించారు,

New Update
Gulzar House fire

Gulzar House fire

 Hyd Fire accident: పాతబస్తీలోని గుల్జార్‌ హౌజ్‌ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించిన విషయం తెలిసిందే.  కాగా ప్రమాదానికి అనేక కారణాలున్నాయని, ప్రమాద తీవ్రత పెరగడానికి ఏసీ కంప్రెషర్‌ పేలుడే కారణమని తేల్చారు.  గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఏసీలు గత కొంతకాలంగా నిరంతరాయంగా నడుస్తు్న్నాయని దీనివల్ల ఒత్తిడి ఎక్కువై పేలిపోయాయని అధికారులు గుర్తించారు, ఒత్తిడితో కంప్రెషర్లు పేలిపోవడంతో ప్రమాదం జరిగిందని నిర్ధారణకు వచ్చారు. 

Also Read:'శుభం' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమంత.. చీర లుక్‌ అదిరింది! (ఫోటోలు)

కాగా కంప్రెషర్ పేలి పోవడంతో పక్కనే ఉన్న ఎలక్ట్రికల్ మీటర్లకు మంటలు వ్యాపించాయని అధికారులు వెల్లడించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఎక్కువ సంఖ్యలో ఏసీలు ఉండడం  పలు ఏసీల్లో ప్రమాదం జరగడంతో భారీగా పొగ వ్యాపించిందన్నారు. పొగ దట్టంగా వ్యాపించడంతో  ఫస్ట్‌, సెకండ్ ఫ్లోర్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో కుటుంబ సభ్యలు ఎవరూ బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఫైర్ సిబ్బంది వచ్చే సరికే పొగతో చాలామంది అపస్మారస్థితిలోకి వెళ్లారు. వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది.

Also Read:ఇస్రో PSLV-C61 ప్రయోగం ఎందుకు ఫెయిలైందంటే?

ఆక్రమ విద్యుత్‌ వాడకం

ప్రమాదం జరిగిన ఇంటి చుట్టుపక్కలున్న స్థానికులు ఎవరికీ కూడా కరెంట్‌ కనెక్షన్లు లేవు. అందరూ అక్రమంగానే కరెంట్‌ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.  ప్రమాదానికి కరెంట్ చోర్యము ఒక కారణమని దర్యాప్తులో తేలింది.  ప్రమాదం జరిగిన బిల్డింగ్‌లోని నగల దుకాణం ఉందని ఆ దుఖాణం మూసివేయగానే హైటెన్షన్ వైర్‌ నుంచి.. కొక్కేల ద్వారా స్థానికులు కరెంట్‌ చోరీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అక్రమ కరెంట్‌ వాడకంతో బాధిత కుటుంబ కరెంట్‌ మీటర్లపై లోడ్‌ బాగా పెరిగిందని వివరించారు. దాని వల్ల వారి మీటర్ లో మంటలు చెలరేగినట్లు గుర్తించారు.మీటర్‌ లో వచ్చిన మంటలు పక్కన ఉన్న ఉడెన్‌ షోకేజ్‌కు అంటుకున్నాయి. దాని నుంచి ఏసీ కంప్రెసర్‌ని మంటలు తాకి, అవి పేలడంతో  మంటలు భారీగా ఎగిసిపడి పెద్ద ప్రమాదానికి కారణమైనట్టు భావిస్తున్నారు.  

Also Read:హరి హర వీరమల్లు 3rd సింగిల్ వచ్చేస్తోంది..

 ప్రహ్లాద్ మోదీ తన కుటుంబసభ్యులతో కలిసి గత కొన్నేళ్లుగా గుల్జార్ హౌస్‌లో నివాసముంటున్నట్లు తెలిపారు. ప్రమాదం సంభవించిన సమయంలో 21 మంది కుటుంబసభ్యులు ఇంట్లో ఉన్నారు. అత్తాపూర్‌లో ఓ వేడుకకు హాజరైన వీరంతా వచ్చి ఇంట్లో నిద్రించారు. అయితే, తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఆ మంటలు అంతకంతకూ పెరగడంతో ఇంట్లో ఉన్న నాలుగు ఏసీ కంప్రెసర్లు పేలి  భారీ అగ్ని ప్రమాదానికి దారి తీసింది. ఈ ప్రమాదంలో 17 మంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు.

Also Read: రాకెట్‌ ప్రయోగం ఫెయిలయితే.. ఉపగ్రహాల శకలాలు ఎక్కడ పడతాయో తెలుసా ?

Advertisment
తాజా కథనాలు