/rtv/media/media_files/2025/05/30/ACEWahnPeRFEZKRnHeSm.jpg)
Suryapet Bus Fire
Suryapet Bus Fire:
సూర్యాపేట జిల్లాలోని మోతె సమీపంలో ఒక ప్రవేటు బస్సు దగ్ధమైంది(Fire Accident). ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైరు పేలడంతో బస్సుకు మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు నిలిపివేశాడు. కాగా ప్రమాదం సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికంగా ఉన్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: ఇండియాలో సివిల్ డిఫెన్స్ మాక్‌డ్రిల్ వాయిదా.. ఎందుకంటే?