Jubilee Hills By Elections: నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. షెడ్యూల్ విడుదల!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.
తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతూ రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన జీవోపై స్టే ఇచ్చేందుకు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ అంశం హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది.
మహారాష్ట్ర ఎన్నికలపై రాహుల్ గాంధీ చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ కామెంట్స్‌పై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మండిపడ్డారు. నకిలీ ఓటర్లన్న రాహుల్ గాంధీ వాదనలను ఆయన తిప్పికొట్టారు. చివరి నిమిషంలో అధిక ఓటింగ్ శాతం NDA అనుకూలంగా ఉందనటం హాస్యాస్పదమని ఫడ్నవీస్ అన్నారు.
మహారాష్ట్రతో సహా ఇటీవల జరిగిన అన్నీ రాష్ట్రాల ఓటరు లిస్ట్ ప్రచురించాలి. మహారాష్ట్ర పోలింగ్ బూత్‌లో సాయంత్రం 5 గంటల తర్వాత అన్ని CCTV ఫుటేజ్‌లను విడుదల చేయాలని రాహుల్ గాంధీ ECని డిమాండ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.
జాతీయ ఎన్నికల కమీషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకున్న 40 మొబైల్, వెబ్ అప్లికేషన్లను అనుసంధానం చేస్తూ కొత్తగా ‘ఈసీఐనెట్’ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇకపై సేవలన్నీ ఒకే యాప్‌లో అందుబాటులో ఉండనున్నట్లు స్పష్టం చేసింది.
ఏపీలో మరో ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 22న నోటిఫికేషన్ రిలీజ్ చేయనుండగా మే 13లోపు ఈఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.
వైఎస్ జగన్ నేడు గుంటూరు మిర్చి యార్డును సందర్శించనున్నారు. మిర్చి రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల జగన్ పర్యటనకు ఈసీ నో చెప్పింది. ఒకవేళ వస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
తెలంగాణలో పంచాయితీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఏకగ్రీవాలు లేకుండా ఎన్నికల నిర్వహణ, నోటా తదితర అంశాలపై పార్టీ నేతల నుంచి అభిప్రాయాలుసేకరించింది. ఈ సమావేశంలో వివిధ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.
పంజాబ్ CM భగవంత్ మాన్ ఢిల్లీలోని ఇంటిపై పోలీసులు సోదాలు నిర్వహించారని ఆప్ నేతలు సోషల్ మీడియాలో ఆరోపించారు. డబ్బులు పంచుతున్నారని సీ విజిల్ యాప్‌లో వచ్చిన ఫిర్యాదు దర్యాప్తు చేయడానికి రిటర్నింగ్ ఆఫీసర్ టీం అక్కడికి వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.