దారుణం.. పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్య

కేరళలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఉద్యోగి పని ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బూత్‌ లెవెల్‌ అధికారిగా (BLO) పనిచేస్తున్న అనీష్ జార్జ్‌(44) తీవ్రంగా పని ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు.

New Update
death

 కేరళలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఉద్యోగి పని ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే కేరళలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను ఎన్నికల కమిషన్ అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే కన్నూర్‌లోని పయ్యన్నూర్‌లో బూత్‌ లెవెల్‌ అధికారిగా (BLO) పనిచేస్తున్న అనీష్ జార్జ్‌(44) తీవ్రంగా పని ఒత్తిడికి గురయ్యాడు. 

Also Read: సౌదీలో మరణిస్తే మృతదేహాన్ని ఇవ్వరు.. ఈ రూల్‌ గురించి తెలుసా ?

దీంతో ఆదివారం ఆయన తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SIR పని ఒత్తిడి వల్ల అనీష్.. సమయానికి తిండి లేక, నిద్రపోక తీవ్రంగా ఆందోళన చెందాడని ఆయన కుటుంబం ఆరోపిస్తోంది. మరోవైపు సహోద్యోగి మరణంపై బూత్‌ స్థాయి అధికారులు కూడా ఆందోళనలు చేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా SIR ప్రక్రియకు సంబంధించి విధులు బహిష్కరించారు. 

Also Read: భారత్‌, చైనా మధ్య విమాన సర్వీసులు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ కార్మిక సంఘాలు కూడా జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిరసనలు చేశాయి. అంతేకాదు SIR ప్రక్రియను వాయిదా వేయాలంటూ డిమాండ్ చేశాయి. కేరళ ఎన్డీవో అసోసియేషన్ కూడా ఈ ప్రక్రియను వాయిదా వేయాలని డిమాండ్‌ చేసింది. ఇదిలాఉండగా ఇటీవల బీహార్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్ఐఆర్‌ ప్రక్రియ నిర్వహించిన సంగతి తెలిసిందే. 

Also Read: వణుకుపుట్టించే వీడియోలు.. సౌదీ బస్సు ప్రమాదం విజువల్స్ చూశారా..

Advertisment
తాజా కథనాలు