/rtv/media/media_files/YJL9u55uOdRcxQXJoJlt.jpg)
ఏపీలో మరో ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 22న నోటిఫికేషన్ విడుదలచేసి మే 9న పోలింగ్ జరగనుంది.
ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్
29 వరకు నామినేషన్ల స్వీకరణ..
ఈ మేరకు ఒక రాజ్యసభ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
ఇది కూడా చూడండి: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో
30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించనుండగా.. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కించనున్నట్లు తెలిపారు. మొత్తంగా మే 13వ తేదీలోపు ఈఎన్నికల ప్రక్రియ పూర్తికానున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!
Also Read : డ్రగ్స్ మత్తులో స్టార్ హీరో బలవంతం.. మలయాళ నటి సంచలన ఆరోపణలు!
ec | today telugu news | andhra-pradesh-politics | today-news-in-telugu | latest-telugu-news | breaking news in telugu | andhra-politics | by-elections | vijayasai reddy