EC: ‘ఈసీఐనెట్‌’.. ఎన్నికల కమీషన్ సంచలన నిర్ణయం.. సేవలన్నింటికీ ఒకే యాప్!

జాతీయ ఎన్నికల కమీషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకున్న 40 మొబైల్‌, వెబ్‌ అప్లికేషన్లను అనుసంధానం చేస్తూ కొత్తగా ‘ఈసీఐనెట్‌’ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇకపై సేవలన్నీ ఒకే యాప్‌లో అందుబాటులో ఉండనున్నట్లు స్పష్టం చేసింది. 

New Update
EC

National Election Commission launch ‘ECINet’ app

National Election Commission: జాతీయ ఎన్నికల కమీషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న 40 మొబైల్‌, వెబ్‌ అప్లికేషన్లను అనుసంధానం చేస్తూ కొత్తగా ‘ఈసీఐనెట్‌’ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఎన్నికల సంఘం సేవలన్నీ ఒకే యాప్‌లో అందుబాటులో ఉండనున్నట్లు స్పష్టం చేసింది. 

40 వెబ్‌సైట్లు, యాప్‌లు..

ఈ మేరకు ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ, ఓటర్ల నమోదు, వివరాలు, ఫలితాలు, సందేహాల సమాచారాం మొత్తం అందుబాటులోకి తెచ్చేందుకు ఈ డిజిటల్‌ వేదికను రూపొందించింది. గతంలో ఉన్న 40 వెబ్‌సైట్లు, యాప్‌లను అనుసంధానిస్తూ ‘ఈసీఐనెట్‌’ను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. 

Also Read: వీడు భర్త కాదు బండరాయి.. భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తినేశాడు వెధవ!

ఎలక్షన్‌ 24, ఈసీఐ స్వీప్‌, ఈసీఐ వెబ్‌సైట్‌, ఫెంబోసా, ఈఎంఎస్‌, ఆర్టీఐ పోర్టల్‌, ఎన్కోర్‌, మీడియా వోచర్‌, అఫిడవిట్‌ పోర్టల్‌, ఇండియా ఎ వెబ్‌, రిజల్ట్‌ వెబ్‌సైట్‌, వాయిస్ నెట్‌, మిత్‌ వర్సెస్‌ రియాలిటీ, ఎలక్షన్‌ ట్రెండ్స్‌ టీవీ, సీ విజిల్‌ పోర్టల్‌,  సువిధ పోర్టల్‌, అబ్జర్వర్‌ పోర్టల్‌, ఎలక్షన్‌ ప్లానింగ్‌, ఏరోనెట్‌ 2.0, ఓటర్స్‌ సర్వీస్‌ పోర్టల్‌, సర్వీస్‌ ఓటర్‌ పోర్టల్‌, ఈటీపీఎంబీఎస్‌, ఎన్జీఎస్పీ, ఎలక్టోరల్‌ సెర్చ్‌, ఐఈఎంఎస్‌, పీపీఆర్‌ టీఎంఎస్‌,  వెబ్‌ సైట్లతో పాటు ఎరోనెట్‌ యాప్‌, బీఎల్‌వో యాప్‌, సీవిజల్‌, డిసైడర్‌, ఎన్‌కోర్‌ నోడల్‌, ఈఎస్ఎంఎస్‌, ఇన్వెస్టిగేటర్‌, కేవైసీ, మానిటర్‌, అబ్జర్వర్‌, సాక్ష్యం, సువిధ, ఓటర్‌ టర్నౌట్‌ అప్లికేషన్లు అన్నీ ఒకే వేదికలో చేర్చనున్నట్లు వివరించింది. 

Also Read :  మెగాస్టార్ హీరోయిన్ ఫస్ట్ లుక్.. 'అవని' గా త్రిష సందడి !

 new-app | telugu-news | today telugu news 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు