EC: ఏకగ్రీవ ఎన్నికలపై ఈసీ సంచలన ఆదేశాలు

తాజాగా ఎన్నికల సంఘం.. సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో జరిగే ఏకగ్రీవ ఎన్నికలపై కీలక ప్రకటన చేసింది. గ్రామాల్లో వేలం ద్వారా లేదా బలవంతంగా సర్పంచ్‌, వార్డు మెంబర్ స్థానాలకు జరిగే ఏకగ్రీవ ఎన్నికలపై దృష్టి సారించాలని ఎన్నికల అధికారులను ఆదేశించింది. 

New Update
Election Commission

Telangana Local Body Elections

తెలంగాణలో 11,14,17 తేదీల్లో మూడు విడుతల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. గురువారం నుంచే మొదటి దశ ఎన్నికల నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎన్నికల సంఘం.. సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో జరిగే ఏకగ్రీవ ఎన్నికలపై కీలక ప్రకటన చేసింది. గ్రామాల్లో వేలం ద్వారా లేదా బలవంతంగా సర్పంచ్‌(Sarpunch Elections 2025), వార్డు మెంబర్ స్థానాలకు జరిగే ఏకగ్రీవ ఎన్నిక(telangana local body elections 2025)లపై దృష్టి సారించాలని ఎన్నికల అధికారులను ఆదేశించింది. 

Also Read: పొలంలో రూ.500 నోట్లు నాటిన రైతు.. ఎందుకిలా చేశాడంటే ?

EC Key Update On Elections

వేలంపై ప్రత్యేక పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. వేలంలో బలవంతం, బెదిరింపులు, ప్రలోభపెట్టడం లాంటి చర్యల నివేదికలను ఎన్నికల అధికారులు రియల్‌ టైమ్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని పేర్కొంది. నామినేషన్ ఉపసంహరించుకునే అభ్యర్థుల నుంచి స్వచ్ఛందంగా జరిగిందని నిర్ధారిస్తూ రిటర్నింగ్ అధికారి ఒక ప్రకటనను పొందాల్సి ఉంటుందని తెలిపింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018లోని సెక్షన్ 211 ప్రకారం.. వేలం, ప్రలోభం, బలవంతం ఎలాంటివి జరగలేదని నిర్ధారిస్తూ సింగిల్/పోటిలేని అభ్యర్థి నుంచి రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ పొందాలని తెలిపింది. 

Also Read: దివ్యాంగులకూ.. ఆ చట్టం కావాలి: సుప్రీంకోర్టు

Advertisment
తాజా కథనాలు