YS Jagan: కూటమిపై జగన్ మొదటి యుద్ధం.. కలెక్టర్ సీరియస్!

వైఎస్ జగన్ నేడు గుంటూరు మిర్చి యార్డును సందర్శించనున్నారు. మిర్చి రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల జగన్ పర్యటనకు ఈసీ నో చెప్పింది. ఒకవేళ వస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

New Update
YS Jagan to Visit Guntur Chilli Yard today

YS Jagan to Visit Guntur Chilli Yard today

YS Jagan Guntur Tour : వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy) నేడు గుంటూరులో పర్యటించనున్నారు. ఆయన కూటమిపై మొదటి యుద్ధం చేయబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు గుంటూరు మిర్చి యార్డు (Mirchi Yard) కు జగన్‌ ఇవాళ వెళ్లనున్నారు. అక్కడ మిర్చి యార్డును ఆయన తొలుత సందర్శించనున్నారు.

Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి... జాగ్రత్త!

మిర్చి రైతులతో ముఖా ముఖి

అనంతరం అక్కడి మిర్చి రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడనున్నారు. కాగా గత కొద్ది రోజులుగా అక్కడి మిర్చి రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని.. సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో తామెంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలో జగన్ గుంటూరు పయనమయ్యారు.

Also Read: IT Refunds: రిటర్నులు ఆలస్యమయ్యాయా..అయితే  నో రిఫండ్‌.. ఐటీ శాఖ ఏమందంటే!

దీంతో జగన్ పర్యటనతో గుంటూరులో హై టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. అయితే జగన్ పర్యాటనకు ఈసీ (EC) బ్రేకులు వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల మిర్చి యార్డులోకి అనుమతిని ఈసీ నిరాకరించింది. అయినప్పటికీ మిర్చి రైతులను కలుసుకుని.. వారి ఇబ్బందులు తెలుసుకుంటామని వైసీపీ నేతలు అంటున్నారు. 

Also Read :  Online Betting: నా సోదరుడు, మరదలు అప్పులు తెచ్చారు.. నేనిక తీర్చలేను: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు ముగ్గురు బలి!

చర్యలు తప్పవు

మరోవైపు మిర్చి యార్డులోకి రావడం కుదరదని కలెక్టర్ సైతం తేల్చి చెప్పారు. జగన్‌ గనుక మిర్చియార్డు లోపలికి వస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవలసి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో జగన్ వచ్చి తీరుతారంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. 

Also Read :  Maha Kumbh Mela: ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే వారికి అలర్ట్..నేడు ఆ రైలు రద్దు..14 గంటల ముందే రైల్వే శాఖ ప్రకటన!
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు