/rtv/media/media_files/2025/11/10/harish-rao-complains-to-ec-2025-11-10-13-57-16.jpg)
Harish Rao complains to EC
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం BRK భవన్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంగించి కాంగ్రెస్ పార్టీ డబ్బులు, చీరలు, మద్యం పంపిణీ చేస్తోందని తెలిపారు. కొందరు అధికారులు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా కొందరు పోలీసులు, ఎన్నికల అధికారులు మారారని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు అడ్డుగోలుగా మద్యం, చీరలు, డబ్బులు పంపిణీ చేస్తున్నారని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు చేస్తూ ఆలస్యంగా రావడం, ఇన్‌ఫర్మేషన్ లీక్ చేసి చీరలు పంచే వారిని అలర్ట్ చేసి అధికారులు అక్కడికి వస్తున్నారని హరీశ్ రావు చెప్పుకొచ్చారు. వాటన్నింటిని వీడియోలు, ఫోటొల ఆధారాలతో సహా చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు అందజేశామన్నారు బీఆర్ఎస్ నాయకులు. ఎన్నికల అధికారులు బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదులు స్వీకరించారు. వాటిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు హరీశ్ రావు మీడియాకు తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కొన్ని సెన్సిటివ్ బూత్‌లను గుర్తించి కేంద్ర బలగాలను నియమించాలని కోరినం
— Telugu Scribe (@TeluguScribe) November 10, 2025
మహిళా పోలీస్ అధికారులను, ఆశా, అంగన్వాడీ వర్కర్లను నియమించి ఓటు వేయడానికి వెళ్ళే ప్రతి మహిళ గుర్తింపును చెక్ చేయాలి
ఇలా చెక్ చేయడానికి ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి, కచ్చితంగా ప్రతి… pic.twitter.com/VRKlD559vv
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి డబ్బులు పంపిణీ చేయడంపై బీఆర్కే భవన్‌లో ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి, ఫిర్యాదు చేసిన మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ… pic.twitter.com/40B3gT7QB7
— BRS Party (@BRSparty) November 10, 2025
ఎర్రగడ్డ, షేక్‌పేట, బోరబండ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంపిణీ చేస్తున్న అధికారులు చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సి విజిల్ ఆప్‌లో కూడా కంప్లైయింట్ చేశామని చెప్పారు. కుప్పలు కుప్పలుగా ఫేక్ ఓటర్ ఐడీలు కూడా అధికార పార్టీ తయారు చేస్తోందని ఆయన ఆరోపించారు. యూసఫ్‌గూడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆనుకోని పోలింగ్ బూత్ ఉందన్నారు. పోలింగ్ బూత్‌కు 100 మీటర్ల దూరంలో పార్టీ కార్యాలయాలు ఉండకూడదనే రూల్ ఎన్నికల అధికారులు మార్చిపోయారా అని హరీశ్ రావు ప్రశ్నించారు. వెంటనే పోలింగ్ బూత్ లేదా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అక్కడ నుంచి మార్చాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) November 10, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్ ఐడి కార్డులు సిద్ధం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ
వీడియో ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన హరీష్ రావు pic.twitter.com/0oYEtRXzML
సీఎం రేవంత్ రెడ్డి ఉప ఎన్నిలలో ఓటమి భయంతో ఈరోజు ఆరు గ్యారెంటీలపై రివ్యూ మీటింగ్ పెట్టారు. ఆరుగ్యారెంటీలపై రెండేళ్లుగా ఎందుకు రివ్వ్యూ పెట్టలేదని హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ ఎన్నికతో రేవంత్ రెడ్డికి చెమటలు పడుతున్నాయని హరీశ్ రావు చెప్పారు.
Follow Us