Delhi: ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
76వ గణతంత్ర వేడుకలను ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలను ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
76వ గణతంత్ర వేడుకలను ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలను ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారంటూ ఢిల్లీ సీఎం ఆతిషీ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కేజ్రీని హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని చెప్పారు. పోలీసులు బీజేపీ కార్యకర్తల్లాగే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఖోఖో వరల్డ్ కప్ టోర్నీలో భారత మహిళ, పురుషుల జట్లు అదరగొట్టాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో నేపాల్‌తో జరిగిన ఫైనల్లో ఇండియా టీమ్స్ ఘన విజయం సాధించాయి. ఖో ఖోలో తొలి ప్రపంచకప్ గెలిచిన జట్లు మనవే కావడం విశేషం.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 'సంకల్ప పత్రా' పార్ట్-1 పేరుతో బీజేపీ మేనిఫెస్టోను ప్రకటించింది. గర్భిణీలకు రూ.21 వేల ఆర్థిక సాయం, పేదలకు రూ.500 లకే ఎల్పీజీ సిలిండర్లు, మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది.
ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలుకు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపివేసింది. ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణలో అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.
జమ్మూలోని రాజౌరీ జిల్లాలో అంతుచిక్కని మరణాలు ఆందోళనకు దారి తీస్తున్నాయి. నెలన్నరలో దాదాపు 5 మంది దాకా చనిపోయారు. డాక్టర్లకు కూడా అర్ధం కాని జబ్బుతో ప్రజలు చనిపోతుండడం అక్కడ ప్రజలను కలవరపడుతోంది.
ఢిల్లీలో 400లకు పైగా విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చిన కేసులో.. అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని వెనుక ఉన్నది 12వ తరగతి విద్యార్థి తండ్రి ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నట్లు తేలింది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నింటాయి. ప్రధాని మోదీ, చిరంజీవి మరికొంత మంది మంత్రులు ఇందులో పాల్గొన్నారు. కిషన్‌రెడ్డి పల్లెటూరులా తన ఇంటిని అలంకరించి..సంక్రాంతి సంబరాలను జరిపించారు.
ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రధానితో పోల్చారు రాహుల్ గాంధీ. సోమవారం ఈశాన్య ఢిల్లిలోని సీలంపూర్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మోదీ, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని విమర్శించారు.