/rtv/media/media_files/2025/04/27/9SE9CtP5KOOrKcn9Nro7.jpg)
ఢిల్లీలో 5వేల మంది పాకిస్తానీలు
భారత్, పాక్ ఉద్రిక్తతల మధ్య ఇండియా నిఘూ సంస్థలు అలర్ట్ అయ్యాయి. ఉగ్రవాదులను భారత్‌లో దాడులకు ఉసిగొల్పుతుంది పాకిస్తాన్ గవర్నమెంట్. పహల్గామ్ ఉగ్రదాడితో ఇరు దేశా మధ్య పరిస్థితి భయానకంగా ఉంది. దీంతో పాకిస్తాన్ పౌరులు ఇండియా నుంచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం 5000 మంది పాకిస్తానీలు ఉన్నారని ఇంటెలిజెన్సీ ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు లిస్ట్ పంపింది. వారందరినీ వెంటనే పాకిస్తాన్ పంపేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) ఈ డేటాను ఢిల్లీ పోలీసులు స్పెషల్ బ్రాంచ్‌కు పంపింది. పోలీసులకు అందిన డేటా ప్రకారం పోలీసులు ఆయా జిల్లాల్లో ఉన్న పాకిస్తానీల అడ్రస్, ఐడెంటిటీ గుర్తిస్తున్నారు.
Also Read: Rajinikanth ఫ్యాన్స్ తో కలిసి సింపుల్ గా తలైవా జర్నీ.. విమానమంతా అరుపులు, కేకలు! వీడియో చూశారా
5,000 Pakistanis In Delhi
Intelligence Bureau identifies around 5000 Pakistani nationals in Delhi
— ANI Digital (@ani_digital) April 27, 2025
Read @ANI Story https://t.co/DwrqjqeaNS #Pakistaninationals #PahalgamTerroristAttack #IB #MHA pic.twitter.com/UYO8gZuaTC
Also Read : బరువు తగ్గాలనుకుంటున్నారా..అయితే ఈ రోజ్ టీ తాగితే సరి!
వారిలో దీర్ఘకాలిక వీసాలు ఉన్నవారు, పాక్ నుంచి వలస వచ్చిన హిందూలు కూడా ఉన్నారు. ఈ జాబితా ధృవీకరణ కోసం సంబంధిత జిల్లాలకు అప్పగించారు. పాకిస్తానీ జాతీయులను వారి దేశానికి తిరిగి రావాలని కోరారు. ఢిల్లీలో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరులు జాబితా 3వేలు, 2వేలు మందిగా రెండు లిస్ట్‌లు తయారు చేశారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 27 నుండి వైద్య, దౌత్య, దీర్ఘకాలిక వీసాలు మినహా పాకిస్తానీ జాతీయుల వీసాలను రద్దు చేస్తూ ఒక ఉత్తర్వు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న వైద్య వీసాలు కూడా ఏప్రిల్ 29, 2025 తర్వాత చెల్లవు. హిందూ పాకిస్తానీ జాతీయులకు ఇప్పటికే మంజూరు చేయబడిన LTVలు (దీర్ఘకాలిక వీసాలు) చెల్లుబాటులో ఉంటాయని ప్రభుత్వం తరువాత స్పష్టం చేసింది.
Also read : Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
Also Read : లొంగిపో బిడ్డా.. ఉగ్రవాదిని వేడుకున్న తల్లి.. పరీక్ష రాసేందుకు వెళ్లి!
(pakistan | Jammu and Kashmir | delhi | latest-telugu-news | breaking news pahalgam | attack in Pahalgam | intelligence | delhi-police)