ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశ భద్రతపై క్యాబినెట్ కమిటీ ఏడు రోజుల్లో రెండవసారి సమావేశం కావడం విశేషం. ఈ సమావేశం తరువాత రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటనతో పాటుగా పలు అంశాలపై అందులో చర్చించనున్నారు.
PM Modi chairs a meeting with Defence Minister, NSA, CDS and chiefs of all the Armed Forces. https://t.co/fr9y5eVbet
— ANI (@ANI) April 29, 2025
పాకిస్తాన్ పై కేంద్రం కీలక ఆంక్షలు
పాకిస్తాన్ పై ఇప్పటికే కేంద్రం కీలక ఆంక్షలు విధించింది. పాకిస్తాన్ జాతీయులకు వీసాలతో పాటుగా వైద్య వీసాలను కూడా రద్దు చేసింది. దీంతో దాదాపుగా 1,000 మంది పాక్ జాతీయులు భారత్ ను విడిచి వెళ్లారు. ఇక పాకిస్తాన్‌పై మరిన్ని దౌత్యపరమైన ఆంక్షలలో భాగంగా, పాకిస్తాన్‌కు దాదాపు 85 శాతం సరఫరాను అందించే కీలకమైన నీటి భాగస్వామ్య ఒప్పందమైన సింధు జలాల ఒప్పందాన్ని కూడా భారత్ నిలిపివేసింది.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది మరణించారు. కాగా నిషేధిత పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహించినప్పటికీ, దాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి భారీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దాడిలో పాక్ ప్రమేయం ఉందని భారత భద్రతా సంస్థల వద్ద ఆధారాలు ఉన్నాయి.
Also Read : KCR Cutout : కేసీఆర్ కటౌట్కు నిప్పు.. తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్!