Kuldeep Vs rinku singh: రింకూ చెంప పగలగొట్టిన కుల్దీప్.. ఒక్కసారిగా హీటెక్కిన స్టేడియం (వీడియో)

ఢిల్లీ, కోల్‌కతా మ్యాచ్‌లో ఊహించని సంఘటన జరిగింది. ఢిల్లీ బౌలర్ కుల్దీప్ కేకేఆర్ బ్యాటర్ రింకూసింగ్ చెంప పగలగొట్టాడు. నవ్వుతూనే బలంగా కొట్టడంతో రింకూ మొహం ఒక్కసారిగా మారిపోయింది. ఇద్దరి మధ్య వాతావరణం హీటెక్కగా ఈ వీడియో వైరల్ అవుతోంది.

New Update
dc kkr

Kuldeep yadav slaps rinku singh

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఊహించని సంఘటన జరిగింది. ఢిల్లీ బౌలర్ కుల్దీప్ యాదవ్ కేకేఆర్ బ్యాటర్ రింకూసింగ్ చెంప పగలగొట్టాడు. సరదాగానే నవ్వుతుండగా బలంగా కొట్టడంతో రింకూ మొహం ఒక్కసారిగా మారిపోయింది. మరోసారి కూడా కొట్టేందుకు ట్రై చేయడంతో రింకూ తప్పించుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య వాతావరణం హీటెక్కినట్లు కనిపించగా ఈ గొడవకు కారణం తెలియాల్సివుంది. ఈ మ్యాచ్‌లో రింకూ 25 బంతుల్లో 36 పరుగులు చేయగా కుల్దీప్ 3 ఓవర్లలో 27 పరుగులిచ్చి వికెట్ తీయలేకపోయాడు. 

ఢిల్లీకి తప్పమి ఓటమి..

ఇక డూ ఆర్ డై మ్యాచ్ లో ఢిల్లీ 14 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 రన్స్ మాత్రమే చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో డుప్లెసిస్ 62, అక్షర్ పటేల్ 43, విప్రాజ్ నిగమ్ 38 పరుగులు చేసి పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. కోల్‌కతా బౌలర్లలో సునీల్‌ నరైన్‌ 3, వరుణ్‌ చక్రవర్తి 2, అనుకుల్‌ రాయ్‌, వైభవ్‌ అరోరా, రస్సెల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

ఇది కూడా చూడండి: Waqf Board Assets: వక్ఫ్‌ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్రం కీలక ప్రకటన

ఇక కేకేఆర్ బ్యాటర్లలో రఘవంశీ 44 పరుగులు, సింగ్ 36 పరుగులు చేశారు. రహ్మనుల్లా (26), సునీల్ నరైన్ (27), అజింక్య రహానె (26), వెంకటేశ్ అయ్యర్ (7), రింకు సింగ్ (36), రస్సెల్ (17), పొవెల్ (5), రాయ్ (0) మరోసారి నిరాశపరిచారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, విప్రాజ్ నిగమ్  2, అక్షర్ పటేల్ 2, చమీర 1 వికెట్ పడగొట్టారు. 

ఇది కూడా చూడండి: Russia: రష్యా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటన

delhi | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు