/rtv/media/media_files/2025/05/02/btvJ9Vq3zdbkQ1MnPy9r.jpg)
Delhi Rain
ఢిల్లీని వర్షం ముంచెత్తేసింది. దుమ్ము తుఫాన్ తో ఢిల్లీ వాసులు అల్లకల్లోలం అయిపోయారు. తీవ్రమైన ఈదురుగాలులతో భయపెట్టింది. దీంతో ఫ్లైట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇక్కట్లకు గురవుతున్నారు. ముఖ్యంగా కనెక్టివిటీ విమానాలు ఉన్నవాళ్లు చాలా కష్టపడుతున్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ప్రయాణికులు నిలిచిపోయారు. విమానయాన సంస్థలన్నీ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని చెబుతున్నారు. ముందే వైబ్‌సైట్లు చెక్ చేసుకోవాలని సూచించాయి. విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని.. ప్రయాణికులు వైబ్‌సైట్‌ను పరిశీలించుకోవాలని ఎయిరిండియా సూచించింది. కొన్ని విమానాలు ఆలస్యం అవుతున్నాయి..మరికొన్నింటిని దారి మళ్లించాయని చెబుతున్నాయి.
రోడ్ల మీద నలిచిపోయిన నీరు..
మరోవైపు ఢిల్లీలోని ద్వారక, ఖాన్ పూర్, సౌత్ ఎక్స్ టెన్షన్ రింగ్ రోడ్ , మింటో రోడ్, లజపత్ నగర్ , మోతీబాగ్ లలో ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. భారీ ఈదురుగాలులు కారణంగా చెట్లు కూలిపోయాయి. రోడ్ల మీద కొమ్మలు పడిపోయి..ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది. క్లియర్ చేయడానికి ఈరోజంతా పడుతుందని..వీలైంనతం వరకు ప్రజలు ఇళ్ళల్లోనే ఉండాలని అధికారులు సూచించారు.
#WATCH | Delhi | Residents of the national capital woke up to heavy rain showers accompanied by strong winds this morning.
— ANI (@ANI) May 2, 2025
(Visuals from Shanti Path) pic.twitter.com/GTqPL8buy2
today-latest-news-in-telugu | rains | flights
Also Read: Ap: ఆంధ్రాలో ప్రధాని మోదీ పర్యటన..5 కి.మీ పరిధిలో నో ఫ్లై జోన్