Omar Abdullah: సీఎంకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ షాక్.. మర్యాదగా మాట్లాడలేనంటూ ఒమర్ అబ్దుల్లా ఫైర్!

సీఎం ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ విమానాశ్రయంపై అసహనం వ్యక్తం చేశారు. ఇండిగో విమానంలో ప్రయాణించగా దాన్ని జైపూర్‌కు మళ్లించారు. మళ్లీ ఎప్పుడు బయలు దేరుతుందనే విషయాన్ని అధికారులు తెలపలేదని గౌరవంగా మాట్లాడే పరిస్థితుల్లో లేమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
Delhi cm Omar abdullah

Delhi cm Omar abdullah

జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ విమానాశ్రయంపై విమర్శలు చేశారు. శనివారం ఒమర్ అబ్దుల్లా ఇండిగో విమానంలో ప్రయాణించారు. ఈ సమయంలో విమానం జైపూర్‌కు మళ్లించారు. దీంతో ఒమర్ అబ్దుల్లా అసహనం వ్యక్తం చేశారు. ఒమర్ అబ్దుల్లా శనివారం రాత్రి ఢిల్లీకి బయలు దేరాలి. కానీ జైపూర్‌కు ఫ్లైట్ మళ్లించడంతో అక్కడే ఉండిపోయారు.

ఇది కూడా చూడండి: Nishikant Dubey: సుప్రీం కోర్టుపై బీజేపీ ఎంపీ సంచలన కామెంట్స్.. ఊహించని షాక్ ఇచ్చిన జేపీనడ్డా!

ఇది కూడా చూడండి: TG Crime: హైదరాబాద్‌లో దారుణం.. నడి రోడ్డుపై స్నేహితుడుని నరికిన యువకుడు

గౌరవంగా మాట్లాడే పరిస్థితుల్లో లేమని..

ఫ్లైట్ ఎప్పుడు మళ్లీ బయలుదేరుతుందనే విషయాన్ని కూడా ఢిల్లీ విమానాశ్రయ అధికారులు సమాచారం ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రయాణికులు అలసత్వానికి గురి అయ్యారని, సహనం కోల్పోతున్నామని, గౌరవంగా మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేమని ఒమర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇది కూడా చూడండి: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్‌..ఒక్క క్లిక్ చాలు!

ఇదిలా ఉండగా ప్రతికూల వాతావరణం వల్ల శ్రీనగర్ విమానాశ్రయంలో ఆరు విమానాలు రద్దు అయ్యాయి. చాలా విమానాలకు అంతరాయం కలగడం వల్ల విమానాశ్రయాల్లో ప్రయాణికులు గంటల తరబడి ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రయాణికుల అసౌకర్యంపై ఇండిగో ఎయిర్‌లైన్స్‌ స్పందించింది. తమ బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని తెలిపింది. జమ్మూలో భారీ వర్షాలు, వడగళ్లు ఎక్కువగా కురవడం వల్ల విమాన ప్రయాణానికి అంతరాయం కలిగిందని తెలిపింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు