Delhi: ఢిల్లీ హాట్ లో భారీ అగ్నిప్రమాదం...

హస్తకళల సమాహారమైన ఢిల్లీ హాట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి తొమ్మది ప్రాంతంలో అక్కడి మార్కెట్ లో మంటలు చెరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక దళం వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. దాదాపు 25 నుంచి 30 దుకాణాలు కాలిపోయాయి.

New Update
delhi

Fire At Delhi HAAT

కొద్ది సేపటి క్రితం ఢిల్లీ హాట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి 8.44 గంటల ప్రాంతంలో అక్కడ ఉన్న ఐఎన్ఏ మార్కెట్ కు మంటలు అంటుకున్నాయి. ప్రస్తుతం ఏడు అగ్ని మాపక యంత్రాలు అక్కడ మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మంటల కారణంగా దాదాపు 25 నుంచి 30 దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. 

ప్రాణ నష్టం లేదు..

ఢిల్లీ హాట్ చాలా ఫేమస్ ప్రదేశం. ఇక్కడ పాపులర్ కళాకృతుల దుకాణాలు ఉంటాయి. భారత దేశంలో చాలా రాష్ట్రాలకు సంబంధించిన హస్తకళల స్టాళ్ళు పెడతారు. దాంతో పాటూ పలు రాష్ట్రాకలు చెందిన ఫుడ్ ప్లాజా కూడా ఢిల్లీ హాట్ లో ఉంది.  ప్రసంతుతం ఇక్కడ మంటలు అదుపులోకి వచ్చాయని..ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా చెప్పారు. అయితే ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 

 today-latest-news-in-telugu | accident

Also Read: USA: కుప్పకూలిన అమెరికా..దారుణంగా పడిపోయిన ఆర్థిక వ్యవస్థ

Advertisment
తాజా కథనాలు