Delhi Building Collapse: కుప్పకూలిన 20 ఏళ్లనాటి భవనం.. ఇంటి యజమానితో సహా 11 మంది మృతి

ఢిల్లీలోని ముస్తఫాబాద్‌లో బిల్డింగ్ కూలిపోయిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ముగ్గురు పిల్లలతో సహా 11 మంది మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు. మృతుల్లో భవన యజమాని తెహసీన్‌(60)తో పాటు అతని కుటుంబానికి చెందిన మరో ఆరుగురు ఉన్నారు.

New Update
delhi building collapses in mustafabad

delhi building collapses in mustafabad

దేశ రాజధాని ఢిల్లీలోని ముస్తఫాబాద్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. నిర్మాణంలో ఉన్న ఆ భవనం కూలిపోవడంతో అప్పటికి నలుగురు మరణించినట్లు తెలిసింది. 

తాజాగా మృతుల సంఖ్య పెరిగింది. ముగ్గురు పిల్లలతో సహా మొత్తం 11 మంది మరణించినట్లు తెలిసింది. వీరితో పాటు మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో భవనం యజమాని తెహసీన్‌(60)తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఆయనతో పాటు మరో ఆరుగురు మరణించినట్లు సమాచారం. కాగా కూలిన భవనం 20 ఏళ్ల నాటిదని అధికారులు వెల్లడించారు. 

అయితే ఈ ప్రమాదానికి కారణం నిర్మాణ పనులే అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కింది అంతస్తులోని షాపుల్లో నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. అవే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. 

ఏం జరిగిందంటే?

ఈశాన్య ఢిల్లీలోని ముస్తఫాబాద్‌లో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడంతో అప్పటికి నలుగురు మరణించారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపుగా పదిమందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు.

breaking news in telugu | today-news-in-telugu | latest-telugu-news | national news in Telugu | building-collapse | delhi | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు