Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. 2019లో హోర్టింగ్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రజానిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో నమోదైన పిటిషన్‌పై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.