/rtv/media/media_files/2025/05/22/QoEJbH8W0SWuFROnCxOD.jpg)
Delhi -Srinagar Flight
పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో రెండు దేశాలు తమ గగనతలాలను మూసేకున్నాయి. ఒకరి విమానాలు మరొకరి ఎయిర్ బేస్ లోకి రాకుండా ఆంక్షలు విధించుకున్నాయి. ప్రస్తుతం యుద్ధం ఆగినప్పటికీ ఈ ఆంక్షలను, దౌత్య సంబంధాలను మాత్రం ఇంకా కంటిన్య చేస్తూనే ఉన్నారు. తాజాగా పాకిస్తాన్ తన గగనతలాన్ని మరో నెల రోజుల పాటూ మూసేస్తున్నామంటూ ఈ మధ్యనే ప్రకటించింది. దీని ఎఫెక్ట్ నిన్న ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళుతున్న ఫ్లైట్ మీద కూడా పడింది.
ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. బుధవారం సాయంత్రం వడగళ్ల వాన పడటంతో పైలట్ అప్రమత్తం చేశాడు. దీంతో 227 మంది ప్రయాణికులతో విమానం శ్రీనగర్ ఎయిర్ పోర్టులో సురక్షితంగా దిగింది. VT-IMD రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ఇండిగో విమానం 6E2142 శ్రీనగర్ సమీపిస్తున్న సమయంలో వడగళ్ల వాన కారణంగా తీవ్ర గందరగోళాన్ని ఎదుర్కొంది. విమానం 227 మంది ప్రయాణికులు ఉండగా.. పైలట్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అయితే దీనిలో పైలెట్ చాకచక్యం వలన ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అయింది.
నో చెప్పిన లాహోర్ ఏటీసీ
అయితే వాతావరణం బాలేక విమానం కుదుపులకు లోనవుతున్న సమయంలో...ఆ వాతావరణ పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు లాహోర్ ఎయిర్ బేస్ లో కాసేపు ఉంటామని పైలెట్ అక్కడి ఎటీసీ ను సంప్రదించారు. దీనికి లాహోర్ ఎటీసీ అంగీకరించలేదు. భారత విమానాలకు తమ గగనతలంలోకి ప్రవేశం లేదంటూ చెప్పుకొచ్చారు. ఫ్లైట్ కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పినా కనికరించలేదు. పాకిస్తాన్ ఈ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఏం జరిగినా దాయాది దేశం తన వక్రబుద్ధిని పోనిచ్చుకోవడం లేదని మండిపడుతున్నారు.
today-latest-news-in-telugu | delhi | srinagar | flight | pakistan