/rtv/media/media_files/2025/05/18/DAdHKo4HLVL6xT7xtmg6.jpg)
Jyoti Malhotra
Jyoti Malhotra Pakistan Spy Case: పాకిస్తాన్‌కు గూఢచర్యం చేశారనే ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్(Youtuber) జ్యోతి మల్హోత్రా ప్రస్తుతం రిమాండ్‌లో ఉంది. ప్రస్తుతం పోలీసులు ఈమెను విచారిస్తున్నారు. అయితే జ్యోతి మల్హోత్రా ముంబై సందర్శనకు కూడా వెళ్లింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఒకసారి కాదు నాలుగు సార్లు ముంబై వెళ్లడంతో అనుమానిస్తున్నారు. ముంబైకి వెళ్లి అక్కడ జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల వివరాలను పాక్‌కు తెలియజేసిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Espionage for Pakistan: Probe Begins into YouTuber Jyoti Malhotra’s Mumbai Visits. She visited Mumbai four times thrice in 2024 and once in 2023.#JyotiMalhotra #Espionage #Mumbai #PakistanSpy #NationalSecurity #BreakingNews #YouTuberUnderInvestigation pic.twitter.com/acu120Woyj
— Suraj Ojha (@surajojhaa) May 22, 2025
ఇది కూడా చూడండి: Cinema: వరుసపెట్టి బయోపిక్ లలో ధనుష్..అబ్దుల్ కలాంగా కొత్త సినిమా
మూడు సార్లు ముంబైలో పర్యటించి..
జ్యోతి 2024లో మూడుసార్లు, 2023 సంవత్సరంలో ఒకసారి ముంబైకి వెళ్లింది. అక్కడికి వెళ్లిన ప్రతీ వీడియో, ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. జ్యోతి జూలై 2024లో లగ్జరీ బస్సులో ముంబైకి వెళ్లింది. 2024 ఆగస్టులో ఆమె అహ్మదాబాద్ నుంచి ముంబైకి కర్ణావతి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లింది. ఆ తర్వాత న్యూఢిల్లీ నుంచి పంజాబ్ మెయిల్ ద్వారా ముంబైకి వెళ్లింది. అలాగే 2023లో వినాయక చవితి సందర్భంగా 'లాల్‌బాగ్ కా రాజా'ను సందర్శించడానికి వెళ్లింది.
ఇది కూడా చూడండి: భారతదేశ అణుశక్తి వాస్తుశిల్పి డాక్టర్ శ్రీనివాసన్ గురించి మీకు తెలుసా..?
ఇలా వెళ్లిన ప్రతీ సారి జనసందోహం ఉన్న ప్రాంతాలను వీడియోలు తీసింది. వీటిని పంపించినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది. అయితే జ్యోతి ఎవరికి ఫొటోల పంపించిందో అనే విషయం అయితే క్లారిటీ లేదు. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి అతను పాకిస్తానీ ఏజెంట్లతో సంబంధాలు కొనసాగించినట్లు కూడా తెలిసింది.
ఇది కూడా చూడండి:Delhi: ఢిల్లీ-శ్రీనగర్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు.. వీడియో వైరల్!\