PM Modi: కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేస్తే ఏదీ అసాధ్యం కాదు..ప్రధాని మోదీ

కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రాలు కలిసి పనిచేస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించాలంటే ఇదొక్కటే మార్గమని చెప్పారు. 10వ పాలకమండలి సమావేశంలో రాష్ట్రాల ప్రతినిధులతో ప్రధాని సమావేశమయ్యారు. 

New Update
delhi

10th Governing Council meeting

భారత్ లోని నీతి ఆయోగ్..యూకే, యుఏఈ, ఆస్ట్రేలియాలతో వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసిందని...రాష్ట్రాలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన 10వ పాలకమండలి సమావేశంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యం గురించి ప్రధాని మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేస్తేనే విధానపరమైన అడ్డంకులు తొలిగి ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించగలుగుతామని చెప్పారు. దీనికి రాష్ట్రాలు  తీసుకోవాల్సిన చర్యలపై,  ఉద్యోగాలను సృష్టించడానికి, తయారీ రంగాన్ని విస్తరించడంపై దృష్టి పెట్టాలని అన్నారు. అభివృద్ధి వేగాన్ని పెంచాలని..అందరూ లిసి టీమ్ ఇండియా గా పని చేయాలని ప్రధాని మోదీ కోరారు. ఈ సమావేశానికి 31 రాష్ట్రాలు మరియు మొత్తం 36 కేంద్రపాలిత ప్రాంతాలు హాజరయ్యాయి. కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు మాత్రం హాజరుకాలేదు. 

దీర్ఘకాలిక ప్రణాళిక..

దీంతో ఈ సమావేశంలో పహల్గాం దాడి తరువాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి కూడా ప్రధాని వివరించారు. ఆపరేషన్ సింధూర్ ఒక్కసారి చేసి వదిలేసి కాదని..ఉగ్రవాదం పూర్తిగా సమసిపోయే వరకు దీర్ఘకాలిక విధానంగా అవలంబిస్తామని చెప్పారు. దీనికి ప్రజలను సంసిద్ధులను చేయాలని పిలుపునిచ్చారు.  

 today-latest-news-in-telugu | pm modi | delhi

Also Read: USA: ప్లాంట్ నిర్మించుకోవచ్చు కానీ సుంకాలు చెల్లించాల్సిందే..ట్రంప్

Advertisment
తాజా కథనాలు