IPL 2025: ఐపీఎల్ కాదు.. ఏపీఎల్.. ముంబై జట్టు చీటింగ్ ఫ్రూఫ్ ఇదిగో!

ఐపీఎల్ 2025లో ఢిల్లీపై విజయం సాధించి ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు చీటింగ్ చేసిందని సోషల్  మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి. ముఖేష్ అంబానీ తన డబ్బులతో అంఫైర్లను కొనేశాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

New Update
MUmbai indians

MUmbai indians

ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. 59 పరుగులు తేడాతో ఢిల్లీపై ముంబై జట్టు గెలుపొందింది.  ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు చీటింగ్ చేసిందని సోషల్  మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి. ముఖేష్ అంబానీ తన డబ్బులతో అంఫైర్లను కొనేశాడని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇది ఐపీఎల్ కాదని, అంబానీ ప్రీమియర్ లీగ్ అని కామెంట్లు చేస్తున్నారు. ముంబై జట్టు చీటింగ్ చేసిందని అనడానికి సంబంధించిన ఆధారాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

ఇది కూడా చూడండి: Cinema: వరుసపెట్టి బయోపిక్ లలో ధనుష్..అబ్దుల్ కలాంగా కొత్త సినిమా

ఇది కూడా చూడండి: భారతదేశ అణుశక్తి వాస్తుశిల్పి డాక్టర్ శ్రీనివాసన్ గురించి మీకు తెలుసా..?

అంఫైర్లు అంబానీకి అనుకూలంగా..

ముంబై ఇండయన్స్‌కు అనుకూలంగా అంఫైర్లు నిర్ణయాలు తీసుకున్నారని కామెంట్లు చేస్తున్నారు. కనీసం చెక్ చేయకుండా సిక్స్ అయితే బౌండరీ ఇచ్చారని అంటున్నారు. అలాగే అభిషేక్ పోరెల్ నాటౌట్ అయితే ఔట్ ఇచ్చారని, మిచెల్ సాంట్నర్ వైడ్ నోబాల్ వేస్తే ఇవ్వలేదని స్క్రీన్‌ షాట్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. డబ్బు ఉంటే ఏదైనా చేయవచ్చని నెటిజన్లు అంటున్నారు.

ఇది కూడా చూడండి:Delhi: ఢిల్లీ-శ్రీనగర్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు.. వీడియో వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు