Heavy Rain: ఢిల్లీలో భారీ వర్షం.. ఈదురుగాలుల బీభత్సం

దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. వేసవి ఎండ తీవ్రతో నగరానికి ఒక్కసారిగి ఉపశమనం కలిగింది. ఈదురుగాలులు, దుమ్ము తుఫాన్‌తో ఘజియాబాద్, కర్నాల్‌లోని ఎన్‌సిఆర్ ప్రాంతాలలో కూడా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

New Update
heavy rain in delhi

దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. వేసవి ఎండ తీవ్రతో ఉన్న నగరానికి ఉపశమనం కలిగింది. ఢిల్లీ మొత్తంలో మే నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి. బుధవారం సాయంత్రం వడగళ్ల వానతో కూడిన వర్షం కురిసింది. ఢిల్లీ ప్రజలు ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందారు. ఈదురుగాలులు, దుమ్ము తుఫాన్ సంభవించింది. ఘజియాబాద్, కర్నాల్‌లోని ఎన్‌సిఆర్ ప్రాంతాలలో కూడా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కర్నాల్‌లోని వీధుల్లో వర్షం కురిసింది. ఘజియాబాద్‌లో కూడా ఈదురుగాలులు, మెరుపులు వీచాయి. 

ఈదురుగాలుల కారణంగా తీన్ మూర్తి మార్గ్ వద్ద చెట్టు కూలిపోయింది. వాతావరణంలో ఆకస్మిక మార్పు కారణంగా జనపథ్ రోడ్డు వద్ద మరో చెట్టు కూలిపోయింది. ఢిల్లీలో వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ విమానాశ్రయాల నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చే అనేక దేశీయ, అంతర్జాతీయ విమానాలు నిలిపివేయబడ్డాయి. దారి మళ్లించబడ్డాయి. రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తాయి. 

(delhi | hyderabad-weather-change | heavy-rains | delhi-ncr | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు