Delhi: ఢిల్లీ ఎన్నికల పోలింగ్ షురూ..కేజ్రీవాల్ పై హర్యానాలో ఎఫ్ ఐఆర్
దేశ రాజధాని ఢిల్లీలో పోలింగ్ షురూ అయింది. సాయంత్రం ఆరు గంటల వరకూ ఓటింగ్ జరగనుంది. 1. 56 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఓటేయనున్నారు. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ మధ్య ఇక్కడ పోటీ బలంగా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో పోలింగ్ షురూ అయింది. సాయంత్రం ఆరు గంటల వరకూ ఓటింగ్ జరగనుంది. 1. 56 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఓటేయనున్నారు. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ మధ్య ఇక్కడ పోటీ బలంగా ఉంది.
నేటి ఢిల్లీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానాలో కూడా కురవనున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఢిల్లీ ఎన్నికలను బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆప్ ను దెబ్బ కొట్టేందుకు ఏ అవకాశాన్ని వదలాలనుకోలేదు. ఇందులో భాగంగానే పన్ను మినహాయింపును కేంద్ర ప్రభుత్వం పెంచిందని అంటున్నారు. ఐటీ దెబ్బ ఆప్ మీద గట్టిగానే పడనుందని చెబుతున్నారు.
ఢిల్లీలో అనుమానంతో భార్యని హత్య చేసిన కైలాష్(40) అనే వ్యక్తి ని బూందీ లడ్డూల సాయంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా సమయంలో పెరోల్ పై విడుదలై పోలీసులకు దొరకకుండా వివిధ ప్రదేశాలకు తప్పించుకు తిరుగుతున్నాడు.
ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కేజ్రీవాల్ ఇంటి ముందు చెత్త వేయడానికి వెళ్లిన mp స్వాతి మాలివార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో చెత్తపేరుకుపోయిందని.. ప్రజలతో కలిసి దాన్ని కేజ్రీవాల్ ఇంటి ముందు వేస్తామని ఆమె వీడియో చేసింది.
ఢిల్లీ డేంజర్ లో ఉందా అంటూ అవుననే అంటోంది ఆప్. నగరానికి సరఫరా చేసే నీటిలో విషం కలుపుతున్నారని..హర్యానా నుంచి ఈ నీరు వస్తోందని మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు. ఇదంతా బీజేపీ పనేనని అంటున్నారు. వీటిని బీజేపీ ఖండించింది.
నేడు మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,240 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,550గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తగా నిర్మాణం చేపట్టిన నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. 10 మందిని రక్షించారు. మరో 12 - 15 మంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
సహజీవనం చేసిన యువతిని యువకుడు కొట్టి చంపాడు. పెళ్లిచేసుకోవాలని కోరిన శిల్పా పాండేని అమిత్ తివారి చంపి సూట్‌కేస్‌లో డెడ్‌బాడీ పెట్టి కాల్చేశాడు. పోలీసుల విచారణలో అమిత్ తివారి దొరికిపోయాడు. తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్ ఏరియాలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.