Delhi: ఢిల్లీని ముంచిన వర్షాలు..100కు పైగా విమనాలు బంద్

విపరీతమైన వర్షాలు దేశ రాజధాని ఢిల్లీని అతలాకుతలం చేశాయి. ఈరోజు తెల్లవారుఝామున కురిసిని పెద్ద వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారు 100కు పైగా విమానాలు నిలిచిపోయాయి.

New Update
dh

Heavy Rains In Delhi

దేశ రాజధాని ఢిల్లీ మునిగిపోయింది. వరుసపెట్టి కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయ్యాయి. ఈరోజు ఉదయం ఢిల్లీ- ఎన్సీఆర్ లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. ప్రధాన రోడ్లన్నీ ట్రాఫిక్ తో స్తంభించిపోయాయి. మరోవైపు వాతావరణశాఖ ఢిల్లీకి రెడ్ అలెర్ట్ ను ప్రకటించింది. ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో 5 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమెదైందని చెప్పింది. 

100కు పైగా విమానాలు..

ఇక ఎడతెగని వర్షాలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ వర్షం కారణంగా దాదాపు 100కు పైగా విమానాల సేవలు నిలిచిపోయాయి. మరో 25కు పైగా విమానాలను దారి మళ్లించారు. ప్రయాణికులు తమ తమ విమానయాన సంస్థలను సంప్రదించాలని ఢిల్లీ ఎయిర్ పోర్టు ఆథారిటీ కోరింది.  భారీ వర్షం కారణంగా మింటో రోడ్డు వద్ద ప్రాంతం పూర్తిగా నీటితో నిండిపోవడంతో ఒక కారు మునిగిపోయినట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  దాదాపు ఢిల్లీ అంతా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. 

 

today-latest-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు