Iran Attack On Israel | ఇరాన్ మెరుపు దాడి | F-35 Fighter Jet | Iran-Israel War Updates | RTV
ఐడీఎఫ్ దాడుల్లో హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వార్ చనిపోయే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. మే నెల ప్రారంభంలో దక్షిణ గాజాలో ఐడీఎఫ్ ఒక ఆసుపత్రిపై దాడి చేసిందని..అందులో సిన్వర్ చనిపోయాడని చెప్పారు.
లెబనాన్ పై ఇజ్రాయెల్ మరోసారి ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది.తమ పై వచ్చే దాడులను ఎదుర్కోవడానికి ప్రతీదాడులు తప్పవని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.
నెతన్యాహుకు సంబంధించిన అవినీతి కేసులో సాక్షులను బెదిరించారనే అభియోగాలను బెంజమిన్ సతీమణి సారా ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పై నేర విచారణ చేస్తున్నట్లు ఆ దేశ పోలీసులు వెల్లడించారు.
ఉత్తర ఇజ్రాయెల్ సిజేరియాలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంట్లో మరోసారి బాంబుల దాడి జరిగింది. ఈ దాడి సమయంలో బెంజిమన్తో పాటు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ఇరాన్ ఈ బాంబుల దాడి చేసినట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది.
అమెరికా, ఇజ్రాయెల్ కు ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీఖమేని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ తోపాటు తమ మిత్రపక్షాలపై దాడులు చేస్తే కోలుకోలేని దెబ్బ కొడతామని హెచ్చరించారు. ఈ రెండు దేశాలు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు.