/rtv/media/media_files/2025/10/20/israel-prime-minister-netanyahu-to-visit-india-by-end-of-2025-2025-10-20-17-54-17.jpg)
israel prime minister netanyahu to visit india by end of 2025
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు త్వరలో భారత్‌కు రానున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడనుంది. ఈ ఏడాది చివర్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. యుద్ధం ఆపాలని ట్రంప్ హెచ్చరించడంతో వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్-హమాస్ ఈ ఒప్పందానికి వచ్చాయి. ఓవైపు అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ ప్రధాని భారత్‌తో సంబంధాలు బలపేతం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇందుకోసమే ఆయన భారత్‌కు రానున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
Also Read: మీ కూతుర్లు హిందూయేతరులతో వెళ్తే కాళ్లు విరగ్గొట్టండి.. ప్రజ్ఞా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు
నెతన్యాహు పర్యటన వల్ల ఇజ్రాయెల్-భారత్ మధ్య అంతరిక్ష పరిశోధనలు, రక్షణ, వాణిజ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ, సాంకేతికత వంటి పలు కీలక రంగాల్లో ఒప్పందాలు కుదరనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలోనే చాలా ఒప్పందాలు కొనసాగుతున్నాయి. నెతన్యాహు పర్యటనలో ఇవి మరింత బలోపేతం కానున్నాయి.
Also Read: ఘోర అగ్ని ప్రమాదం.. రూ.8వేల కోట్లకు పైగా భారీ నష్టం
నెతన్యాహు పర్యట వల్ల భారత్‌కు కూడా అంతర్జాతీయ రాజకీయాల్లో తమ ప్రాధాన్యతను చాటిచెప్పనుంది. ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాలపై తన వైఖరిని తెలియజేసింది. శాంతి చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచనలు చేసింది. మరోవైపు అమెరికా విధించిన భారీ టారిఫ్‌లకు కూడా తలొగ్గలేదు. అంతేకాదు యుద్ధం ప్రభావం వల్ల నష్టపోయిన గాజా ప్రజలకు కూడా మానవతా సాయం చేస్తోంది. అలాగే ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను కొనసాగిస్తూ ప్రపంచ రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరిస్తోంది.